నార‌ప్ప డెమో: బెల్ బాట‌మ్ రోజుల్లో పిల్ల‌ను చూడ‌ట‌మెలా..?

Update: 2021-07-11 05:13 GMT
విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నార‌ప్ప‌. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. డి.సురేష్ బాబు - క‌ళైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అసుర‌న్ (2019) కి రీమేక్ చిత్ర‌మిది. ప్రియ‌మ‌ణి -ప్ర‌కాష్‌రాజ్ - కార్తీక్ ర‌త్నం- ముర‌ళి శ‌ర్మ‌-సంప‌త్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వేట్రిమార‌న్ ఈ చిత్రానికి క‌ర్త క‌ర్మ‌. ఆయ‌నే క‌థార‌చ‌యిత‌.

సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ ఆలోచ‌న‌ను విర‌మించార‌ని ఓటీటీల‌లో రిలీజ్ చేసేందుకు డి.సురేష్ బాబు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. ఇంత‌లోనే తెలంగాణ ఛాంబ‌ర్ విన్న‌పంతో సురేష్ బాబు వెన‌క్కి త‌గ్గారు. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

తాజాగా ఈ చిత్రం నంచి తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ `చ‌లాకీ చిన్న‌మ్మ..` రిలీజైంది. మ‌ణిశ‌ర్మ ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం ... ప‌ల్లె ప‌ట్టు అందాల న‌డుమ సాంగ్ మేకింగ్ ఎంతో అద్భుతంగా కుదిరింద‌నే చెప్పాలి. ప‌ల్లెటూరిలో నార‌ప్ప కుటుంబం.. ఆ కుటుంబంలో కుర్రాడికి పిల్ల‌ను వెతికేందుకు వెళ్లాలి. బెల్ బాట‌మ్ రోజుల్లో స‌కుటుంబ స‌ప‌రివారంగా ఎడ్ల‌బండి క‌ట్టుకుని  పెళ్లి చూపుల‌కు వెళుతుంటే.. ప‌క్క పాపిడి దువ్వుకుని పెళ్లికొడుకు సైకిల్ పై ఆ ఎడ్ల‌బండిని అనుస‌రించి వెళుతుంటే..ఆ కిక్కే వేరు! అన్నంతగా విజువ‌ల్స్ ని క్రియేట్ చేశారు అడ్డాల బృందం. నాటి రోజుల్లో  పిల్ల‌ను చూడ‌ట‌మెలానో భ‌లేగా చూపారు.

నామం బొట్లు నెరిసిన జుత్తుతో వెంకీ లుక్.. డీగ్లామ‌ర‌స్ ప్రియ‌మ‌ణి రూపం కూడా సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. అనంత శ్రీ‌రామ్ ఈ పాట‌ను రాశారు. గాయ‌నీగాయ‌కుల స్వ‌రం ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్ర‌స్తుతం ఈ లిరిక‌ల్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.Full View




Tags:    

Similar News