ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'రాకెట్రీ' ఇటీవల దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ పలు భాషల్లో విడుదల అవ్వడంతో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం నంబి గురించిన చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఈ నంబి అంటూ ఈ జనరేషన్ వారు గూగుల్ చేస్తున్నారు. అద్బుతమైన ప్రయోగాలను చేసిన వ్యక్తిపై అసలు దేశ ద్రోహం కేసు ఎందుకు నమోదు అయ్యింది అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా మాధవన్ నాలుగేళ్లు కష్టపడి తీసిన రాకెట్రీ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాకెట్రీ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నారట.
రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'రాకెట్రీ' సినిమా ట్రైలర్ ప్రధాని వద్దకు వెళ్లింది. నంబి నారాయణన్ మరియు ఆర్ మాధవ్ లు స్వయంగా వెళ్లి ప్రధానికి ఈ ట్రైలర్ ను చూపించడం జరిగిందట. ప్రధాని ట్రైలర్ పై ప్రశంసలు కురిపించి తప్పకుండా సినిమా చూసేందుకు ఆసక్తిని కనబర్చారట. ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు మాధవన్ ను నంబి నారాయణన్ తీసుకు వెళ్లడంతో పాటు సినిమా ట్రైలర్ ను చూపించి చిత్రానికి దర్శకత్వం వహించి నటించింది మాధవన్ అంటూ పరిచయం చేశాడట. ట్రైలర్ చూసిన ప్రధాని చాలా బాగుంది అంటూ మాధవన్ ను అభినందించారని తెలుస్తోంది.
రాకెట్ శాస్త్రవేత్తగా అద్బుతాలను ఆవిష్కరించిన నంబి నారాయణన్ కు విదేశాల నుండి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కాని ఆయన మాత్రం ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నారు. అద్బుతమైన మేధాశక్తి ఉన్న నంబి పై అనూహ్యంగా దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది. ఆయన సాధించిన ఎన్నో విజయాలు అన్ని మర్చి పోయిన వారు ఆయన్ను విమర్శించారు. ఆయన అప్రదిష్టపాలయ్యాడు. తనపై పడ్డ దేశ ద్రోహం కేసు నుండి బయట పడేందుకు నంబి సుదీర్ఘ కాలం పాటు న్యాయ పోరాటం చేశాడు. చివరకు సుప్రీం కోర్టు ఆయన్ను నిర్ధోషిగా ప్రకటించింది. ఆయనపై ఆరోపణలు చేసినందుకు గాను రూ.50 లక్షల చెల్లించాల్సిందిగా ఆదేశించింది. మోడీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నంబి కి పద్మ భూషన్ పురష్కారం ఇచ్చి గౌరవించింది. నంబి గురించి అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తీసినట్లుగా మాధవన్ చెబుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.