తెలుగు లోగిళ్లలో కార్తీక మాసం ప్రత్యేకత తెలిసిందే. ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రతి వారం వనభోజనాల పేరుతో దూరతీరాన ఉన్నకుటుంబ సభ్యులంతా ఓ చోట తప్పక కలుస్తారు. తరాల్ని ఒకే చోట కలిసే గొప్ప వేదిక ఇది. అంతా వనంలో ఓచోట కూర్చొని భోజనాలు చేయడం ఎంతో ఆహ్లాదాన్ని తెస్తుంది. గత కొన్నేళ్ల నుంచి మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) కూడా కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ పరిసరాల్లో ఏదో ఒకచోట వనభోజన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఆదివారం హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఏరీనాలోని టిఎస్ ఐఐఐ పార్క్ లో వనభోజనాల కార్యక్రమం ఆటపాటలతో ఘనంగా జరిగింది.
వనభోజనాల్లో మా మెంబర్లు అంతా పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి జీవితారాజశేఖర్.. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. `మా `మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా పాల్గొన్నారు. ఇలా దాదాపు మాలో యాక్టివ్ గా ఉన్న వాళ్లంతా హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే `మా` అధ్యక్షుడు నరేష్ మాత్రం హాజరు కాలేదు. `మా`లో తలెత్తిన అంతర్గత విబేధాలు కారణంగా ఆయన హాజరు కాలేకపోవచ్చని అనుకున్నా! ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆయన మిస్ అవ్వడం పరిశ్రమలో చర్చకు కారణమైంది.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నరేష్ కు సమాచారం అందించారుట. మీరు కూడా తప్పక రావాలని కోరారుట. కానీ ఆయన వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదుట. మా అంతర్గత విబేధాలను ఆయన ఇంకా మర్చిపోలేదని ఈ సందర్భంగా పలువురు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి నరేష్ విబేధాలు తలెత్తిన నాటి నుంచి మా లో ఓ వర్గానికి దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే వనభోజనాల్లో ఈ సమస్యను పరిష్కరిస్తారని భావించినా అది కుదరలేదని భావిస్తున్నారు.