లవర్ మీద కోపం.. బికినీపై చూపిస్తే ఎలా

Update: 2016-08-01 15:30 GMT
బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ యాక్టింగ్ విషయంలో చాలా ట్యాలెంట్ చూపిస్తుంది. అయితే.. గ్లామర్ షోకుల విషయంలో అభ్యంతరాలు అంతగా లేని ఈ భామ.. బికినీ ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రం ససేమిరా అనే బాపతు. ఫోటో షూట్స్.. ఆన్ స్క్రీన్ లో ఓకే కానీ.. తను మాత్రం బికినీ ఫోటోలు పెట్టేది కాదు. మరి ఇప్పుడేమైందో కానీ.. ఒకేసారి అరడజన్ బికినీ ఫోటోలను నెట్ లో పెట్టేసింది. ఇందుకు లవర్ తో బ్రేకప్ నే కారణంగా చెప్పేసుకుంటున్నారు.

స్వతహాగా అమెరికన్ అయిన నర్గీస్ ఫక్రీ.. ప్రస్తుతం గ్రీస్ టూర్ లో ఉంది. ఏధెన్స్ లో చక్కర్లు కొడుతున్న ఈ భామ.. అక్కడి బీచ్ లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి తన బికినీ ఫోటోలను కుప్పలు తెప్పలుగా నర్గీస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి.. ఉదయ్ చోప్రాతో బ్రేకప్ కారణమని అనుకుంటున్నారు. పైగా.. ఈ మధ్య నాకు మొగుడొద్దు.. కుక్క చాలంటూ ఓ డిఫరెంట్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది లెండి. 'ఈ దేశంలో జనాలకు డేటింగ్ అంటే తెలీదు. అలా వెంటబడ్డవాళ్లే తర్వాత.. మీరెవరు అన్నా అంటారు' అని వేసిన కౌంటర్ ఉదయ్ చోప్రాకే అంటున్నారు.

ఇటు లవర్ కి పంచ్ వేస్తూనే.. మళ్లీ కవరింగ్ కూడా చేసేస్తోంది. 'లైఫ్ ను ఎంజాయ్ చేయాల్సిందే. ఇదేమీ రిహార్సల్ కాదు' అంటూ కొటేషన్స్ కూడా రాస్తోంది. మెగా 150లో హీరోయిన్ అంటూ టాలీవుడ్ లో కూడా ఈమె పేరు బాగానే వినిపించింది. భారీ ఆఫర్లు.. లవ్ ఎఫైర్.. ఏదీ వర్కవుట్ కాకపోవడంతోనే.. ఇప్పుడిలా బికినీ సోకులు ఆరేస్తేందని టాక్.
Tags:    

Similar News