డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి చెప్పాడు.. సీనియర్ యాక్టర్ నాజర్ చెప్పాడు.. ఇంకా సన్నిహితులు - ‘సైజ్ జీరో’ యూనిట్ సభ్యులు చాలామందే చెప్పారు అనుష్కకు. మేకప్ తో మేనేజ్ చేసేయమని. కానీ స్వీటీ మాత్రం ససేమిరా అనేసింది. ఎంత బరువు కావాలన్నా సొంతంగా పెరుగుతా అని పట్టుబట్టుక్కూర్చుంది. ఇప్పటిదాకా ఇండియాలో ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది. పాతిక కిలోల దాకా బరువు పెరిగి ‘సైజ్ జీరో’లో నటించింది. మళ్లీ ఇప్పుడు బరువు తగ్గించుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. అదీ అనుష్క కమిట్ మెంట్.
ఐతే అనుష్కలా పాతిక కిలోల వరకు ఎందుకు ఓ ఐదు కిలోల బరువు పెరగమన్నా.. ఆ సినిమా వదులకుంటానంటోంది బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రి. ఈ బరువులు పెరగడాలు - తగ్గడాలు అంతా హీరోల గొడవ అని.. హీరోయిన్ల విషయంలో ఇలాంటి షరతులు పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటోంది. ఒకవేళ దర్శకులు అలాంటి షరతులు పెట్టినా హీరోయిన్లు ఒప్పుకోకూడదని.. తనైతే మాత్రం అలాంటి సినిమాలు వదులుకుంటాను తప్పితే.. బరువు మాత్రం పెరగనని ఖరాఖండిగా చెప్పేసింది నర్గీస్. మరి ఈ మాటలు ఏ ఉద్దేశంతో అందో కానీ.. మన అనుష్కపై సెటైర్లు వేసినట్లున్నాయి మరి.