వెటరన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మునుపు ఎన్నడూ లేనంతగా ఆయన ఫొటో షూట్ చేసుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఫొటో షూట్లో నాజర్ కొత్తగా సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపించడం సర్ప్రైజింగ్గా అనిపించింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కర్లింగ్ హెయిర్‌తో నాజర్ ఈ ఏజ్‌లో అదరగొట్టడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
క్షత్రియ పుత్రుడు ( దేవర్ మగన్)లో మాయా దేవర్.. - నాయకన్ (నాయకుడు) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్.. - బాహుబలి.. బిజ్జలదేవ .. ఇలాంటి పాత్రల్లో నటించిన నాజరేనా అని అంతా అవాక్కవుతున్నారు. వైట్ టీషర్ట్.. ఆ పై కార్గొస్ ధరించిన నాజర్ లుక్ కిల్లింగ్ హాట్‌గా సింప్లీ సూపర్బ్‌గా వుంది. నాజర్ న్యూలుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
63 ఏళ్ల సీనియర్ క్యారెక్టర్‌గా నాజర్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరుంది. గత మూడు దశాబ్దాలుగా నటుడిగా నిత్యం బిజీగా వుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. బాహుబలి ఫ్రాంచైజీలో బిజ్జిలదేవగా నటించి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తుండటంతో నాజర్ గురి ఆ చిత్రాలపై పడిందంట. అందుకు తగ్గట్టుగా సినిమాల్లో నటించాలని నాజర్ ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే స్లైలిష్ లుక్ తో కర్లింగ్ హెయిర్‌తో ఫొటో షూట్‌కి పోజులిచ్చారని అంటున్నారు.