వర్మ వాళ్లకు అడ్డంగా దొరికిపోయాడుగా..

Update: 2017-05-13 10:55 GMT
రామ్ గోపాల్ వర్మ అంటే బాలీవుడ్ జనాలకే కాదు.. అక్కడి మీడియాకు కూడా భలే మంట. సౌత్ నుంచి వచ్చి బాలీవుడ్లో జెండా పాతడం.. ఒక టైంలో ‘ఆర్జీవీ ఫ్యాక్టరీ’ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ పెట్టి బాలీవుడ్ వ్యవస్థనే సవాలు చేయడం అక్కడి జనాలకు నచ్చలేదు. పైగా గత కొన్నేళ్లలో ట్విట్టర్ వేదికగా ఆయన ఎందరు బాలీవుడ్ సెలబ్రెటీల్ని టార్గెట్ చేసుకున్నారో తెలిసిందే. ఇక మీడియా మీద కూడా సందర్భానుసారంగా సెటైర్లు గుప్పిస్తుంటాడు వర్మ. టీవీ ఛానెళ్లలో కూర్చుని ఎన్నో సార్లు మీడియా వాళ్లతో మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనత వర్మదే. అందుకే ముంబయి దాడుల సమయంలో మహారాష్ట్ర సీఎం వెంట వర్మ వెళ్తే.. దాన్ని పెద్ద వివాదంగా మార్చింది నేషనల్ మీడియా. దీనికి ప్రతిగా మీడియాను టార్గెట్ చేస్తూ ‘రణ్’ అనే సినిమా చేశాడు వర్మ.

ఈ పాత వైరం సంగతి పక్కన పెడితే.. మధ్యలో కొన్నేళ్ల పాటు ముంబయిని వదిలేసి హైదరాబాద్ లో సినిమాలు చేసుకుంటూ ఉన్న వర్మ తిరిగి గత ఏడాదే ముంబయి చేరుకున్నాడు. హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అప్పట్నుంచి మీడియా మళ్లీ వర్మను టార్గెట్ చేసుకుంది. వర్మ రీఎంట్రీ మూవీ ‘వీరప్పన్’ గాలి తీసేసింది. ఇప్పుడు ‘సర్కార్-3’ మీద పడింది. ఈ సినిమాలో కంటెంట్ అంతంతమాత్రమే అన్నది ఫస్ట్ షోతోనే తేలిపోయింది. ఐతే ఇందులో అమితాబ్ నటించాడని కూడా చూడకుండా.. ఈ సినిమాను టార్గెట్ చేసుకుంది నేషనల్ మీడియా. వెబ్.. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సినిమాను దునుమాడేస్తూ రివ్యూలు ఇస్తున్నారు. 1.5.. 2 రేటింగులతో సమీక్షకులు ఈ చిత్రాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ దెబ్బకు ‘సర్కార్-3’ ఒక వారం కూడా థియేటర్లలో నిలబడేలా కనిపించట్లేదు. మొత్తానికి వర్మ-మీడియా హేట్ రిలేషన్ షిప్ దిగ్విజయంగా కొనసాగుతోందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News