ఉయ్యాల‌వాడ‌కు కేంద్ర గుర్తింపు ప‌బ్లిసిటీ స్టంటా?

Update: 2017-06-02 14:57 GMT
సోష‌ల్ మీడియా విస్తృతంగా వ‌చ్చేసిన త‌ర్వాత‌..కొన్ని అంశాలు ఎక్క‌డ పుడుతున్నాయో కూడా అర్థం కాని ప‌రిస్థితి. నిజానిజాల సంగ‌తి ఎలా ఉన్నా.. విష‌యాలు ఎక్క‌డికెక్క‌డికో వెళ్లిపోతున్నాయి. కాకుంటే.. చిన్న‌పాటి లాజిక్కుల‌కు ఓకే అనేలా ఈ వాద‌న‌లు ఉండ‌టంతో ఎంతోకొంత న‌మ్మ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం మీద న‌డుస్తున్న చ‌ర్చ అంతాఇంతా కాదు.

రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ‌గా.. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడిగా బ్రిటీష్ వ‌ల‌స పాల‌న‌పై తిర‌గ‌బడ్డ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు మొద‌లెట్టిందా? అన్న ప్ర‌శ్న‌పై ఆస‌క్తిక‌ర వాద‌న న‌డుస్తోంది. జాతీయ వీరుడిగా గుర్తించే దిశ‌గా కేంద్రం అడుగులు ప‌డ్డాయ‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరేలా వాద‌న‌ను వినిపిస్తున్నారు ప‌లువురు.

త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి విన‌తి మేర‌కు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ని జాతీయ వీరుడిగా ప్ర‌క‌టించే అంశాన్ని కేంద్రం ప‌రిశీలిస్తుంద‌ని.. ఈ అంశాన్ని చూడాలంటూ పీఎంవో కేంద్ర హోంశాఖ‌కు ఫైల్ పంపిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ స‌మాచారం ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న సందేహాలు వినిపిస్తున్న వేళ‌.. ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డి ని జాతీయ వీరుడిగా ప్ర‌క‌టించే అంశం మీద కేంద్రంలో జ‌రుగుతున్న క‌ద‌లిక‌ను త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షుడు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌మ్ మెగాస్టార్ చిరు ఈ పాత్ర‌ను పోషించ‌టంతో ఉయ్యాల న‌ర‌సింహారెడ్డి చ‌రిత్ర ఇప్పుడు తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. అలాంటి వీరుడ్ని టైమ్లీగా జాతీయ వీరుడిగా ప్ర‌క‌టిస్తే.. ఆ మైలేజీ త‌మ‌కే ద‌క్కుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే కేంద్రం.. ఇప్పుడీ విష‌యాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఇదంతా ఉత్త హైప్ అని.. సినిమాకు ప్ర‌చారాన్ని పెంచ‌టం కోస‌మే ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయే త‌ప్పించి.. మ‌రింకేమీ లేద‌న్న మాట‌ను కొంద‌రు చెబుతున్నారు. అయితే.. ఈ రెండు వాద‌న‌ల్లో నిజం ఏమిట‌న్న‌ది కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News