ఓటీటీకి వ‌చ్చేస్తున్న నేచుర‌ల్ స్టార్ మూవీ!

Update: 2022-11-11 15:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఊర మాస్ ఎంట‌ర్ టైన‌ర్ 'ద‌స‌రా'లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో విడుద‌ల కు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా వుంటే హీరో నాని ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవ‌ల త‌ను న‌టించిన సినిమాల‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసిన నాని తాజాగా తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఓ  యూవీ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని సోద‌రి ఘంటా దీప్తి తొలి సారి మెగా ఫోన్ ప‌ట్టి తెర‌కెక్కించిన న్యూ మూవీ 'మీట్ క్యూట్‌'. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై నాని స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా ని ప్ర‌శాంతి తిపిర్నేని నిర్మించింది. అశ్విన్ కుమార్‌, స‌త్యారాజ్‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, రుహానీ శర్మ‌, ఆకాంక్షా సింగ్‌, శివ కందుకూరి, రోహిణి, అదాశ‌ర్మ‌, సంచిత పూనాచ, సునైనా, దీక్షిత్ శెట్టి, గోవింద్ ప‌ద్మ సూర్య‌, రాజా ప్ర‌ధాన పాత్ర‌లలో న‌టించారు. ఐదు విభిన్న క‌థ‌ల స‌మాహారంగా ఈ సిరీస్ ని రూపొందించారు.

శ‌నివారం ట్రైల‌ర్ రిలీజ్ కానున్న ఈ సిరీస్ కు సంబంధించిన పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ఒక్కో పాత్ర ఒక్కో ర‌కంగా క‌నిపిస్తోంది. కొన్ని పాత్రలు చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తే మ‌రి కొన్ని తీక్ష‌ణంగా ఆలోచిస్తూ క‌నిపిస్తున్నాయి. నాని బ్యాన‌ర్ లో వ‌స్తున్న ఓ విభిన్న‌మైన సిరీస్ గా క‌నిపిస్తోంది.

ఈ మూవీని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం సోనీ లీవ్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంద‌ట‌.

రేపు టీజ‌ర్ రిలీజ్ కానున్న నేప‌థ్యంలో హీరో నాని ఈ మూవీ పోస్ట్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు. 'హాయ్.. నేను ప్ర‌తిభావంతుడిన‌ని అనుకున్నాను. అయితే నేను ప్ర‌తిభావంతురాలైన సోద‌రికి సోద‌రుడిని మాత్ర‌మేన‌ని తేలింది. ఆమె చేసిన దాని గురించి చాలా గ‌ర్వంగా వుంది. ఆమె దీనిని ఎలా తీసింద‌నే దాని గురించి ఇప్ప‌టికీ షాక్ లో ఉంది' అని రాసుకొచ్చాడు. ఈ సినిమాకు విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించ‌గా, వ‌సంత్ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News