డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు.. ఊహాగానాలపై ఆల్రెడీ పూరి జగన్నాథ్ అసహనం వ్యక్తం చేశాడు. తమ జీవితాల్నే నాశనం చేసేసిందంటూ మీడియాను నిందించాడు. ఇప్పుడు ఈ కేసులో పూరితో పాటు విచారణ ఎదుర్కొన్న హీరో నవదీప్ కూడా మీడియాను టార్గెట్ చేసుకున్నాడు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా నవదీప్ మీడియాకు పెద్ద క్లాసే తీసుకున్నాడు. తనను సిట్ అధికారులు విచారించిన తీరుపై వార్తలు ఇచ్చే విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని నవదీప్ మండిపడ్డాడు.
ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగా ఊహాగానాలు ప్రచారం చేయడం.. తమకు అందిన సమాచారం అంటూ ఇష్టానుసారం వార్తలు వేయడం సమంజసం కాదని నవదీప్ అన్నాడు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయానని.. సామాన్య ప్రజలు అమాయకులన్న భ్రమలో.. తాము ఏం చెప్పినా.. ఏం రాసినా ప్రజలు నమ్మేస్తారన్న నమ్మకంతో మీడియా ఉందని నవదీప్ విమర్శించాడు. ప్రభుత్వ వ్యవస్థలపై కనీస గౌరవం లేనట్టుగా మీడియా ప్రవర్తిస్తోందని అతను మండిపడ్డారు.
డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా నవదీప్ సోమవారం సిట్ అధికారుల విచారణ ఎదుర్కొన్నాడు. ఉదయం 10.30 నుంచి రాత్రి 9.50 వరకు అతడిని సిట్ బృందం విచారించింది. ఈ సందర్భంగా అధికారులు రక్త నమూనాల కోసం అడిగితే నవదీప్ నిరాకరించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.