ఎన్టీఆర్ తర్వాత నవదీప్ కే

Update: 2017-09-27 13:40 GMT
70 రోజుల పాటు తెలుగు ఆడియన్స్ ను తెగ మురిపించేసిన బిగ్ బాస్ రియాల్టీ షో పూర్తయిపోయింది. సరిగ్గా ఎన్టీఆర్ జై లవకుశ రిలీజ్ సమయానికే.. జూనియర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ పూర్తి కావడం.. కేవలం కాకతాళీయమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ వారికి.. తమ రెగ్యులర్ రెమ్యూనరేషన్స్ కంటే ఎక్కువగానే ముట్టాయని అంటున్నారు. వాస్తవం ఎంతో తెలీదు కానీ.. ఒక్కో రోజు ఎపిసోడ్ కు ఎన్టీఆర్ 50 లక్షలు అందుకున్నాడని టాక్. అయితే.. హౌస్ లో చివరి వరకూ నిలిచి.. బిగ్ బాస్ విజేతగా నిలిచి.. చివరకు 50 లక్షల ప్రైజ్ మనీని యాక్టర్ శివబాలాజీ గెలుచుకున్నాడు.

అయితే.. ఈ గిఫ్ట్ మనీ చిన్న మొత్తమే అనే టాక్ ఉంది. ఆయా వ్యక్తులకు వారి వారి డిమాండ్ ను బట్టి.. పెద్ద మొత్తంలో బిగ్ బాస్ నిర్వాహకులు చెల్లించారట. రోజుకు 75 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకూ రెమ్యూనరేషన్ చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో వారం ఉన్నా.. ఎంత సమయం ఉన్నా.. అన్ని రోజులకు లెక్కకట్టి.. కాల్షీట్స్ ప్రకారం.. వారు రెగ్యులర్ గా తీసుకునే అమౌంట్ కంటే కాస్త ఎక్కువగానే ముట్టచెప్పారట. ఈ లెక్కలో ఎన్టీఆర్ మినహాయిస్తే.. అందరికంటే శివబాలాజీకి రెమ్యూనరేషన్ దక్కిందని తెలుస్తోంది.

నాలుగోవారం తర్వాత షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు నవదీప్. అయినా సరే.. దాదాపు 10 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇతర పార్టిసిపెంట్స్ తో సమానంగా నవదీప్.. భారీ చెక్ అందుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ గా మాట్లాడుకుంటే.. ఎన్టీఆర్ తర్వాత.. ఈ కార్యక్రమం బాగా వర్కవుట్ అయింది నవదీప్ కేనట.







Tags:    

Similar News