‘బిగ్ బాస్’లోకి ఆ హీరో వస్తున్నాడు

Update: 2017-08-12 08:54 GMT
తెలుగు ‘బిగ్ బాస్’ షోలోకి కొత్త అతిథి వస్తున్నాడు. ఐతే ఆ అతిథి రానా దగ్గుబాటి లాగా తన సినిమాను ప్రమోట్ చేసుకుని వెళ్లిపోవట్లేదు. హౌస్ లోనే ఉండబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ హీరో  ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. నవదీప్. శుక్రవారం విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’లో కీలక పాత్ర పోషించిన నవదీప్.. ‘బిగ్ బాస్’ ఆహ్వానాన్ని అంగీకరించి హౌస్ లో గడపబోతున్నాడు.

‘నేనే రాజు..’ మినహాయిస్తే నవదీప్ ఈ మధ్య సినిమాల్లో కనిపించింది అరుదు. అతడికి పెద్దగా అవకాశాల్లేవు. ఈ మధ్యే డ్రగ్స్ కేసులో పోలీసుల నోటీసులందుకుని.. విచారణకు కూడా హాజరై వచ్చాడు. దీంతో అతడి పేరు మీడియాలో బాగానే నానింది. మామూలుగా కూడా నవదీప్ తో కొన్ని వివాదాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నవదీప్ ను షోకు తీసుకొస్తే మసాలా అద్దినట్లుంటుందని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలిసింది.

‘బిగ్ బాస్’ హౌస్ లో మొదట్నుంచి ఉంటున్న ముమైత్ ఖాన్ కూడా డ్రగ్స్ కేసులో నోటీసులందుకోవడం.. షో మధ్య నుంచి వచ్చి విచారణకు హాజరై వెళ్లడం తెలిసిందే. ఇప్పుడు నవదీప్ హౌస్ లోకి వస్తే ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో చూడాలి. ఇప్పటికే దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ద్వారా షోలోకి వచ్చింది. ఆమె వచ్చాక షోకు కొంచెం స్పైస్ యాడ్ అయింది. మరి నవదీప్ రాకతో ఎలాంటి మార్పులు చూస్తామో చూడాలి. నవదీప్ లోనికి వస్తున్న నేపథ్యంలో ఈ వారం ఒకరు కాకుండా ఇద్దరు షో నుంచి ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.
Tags:    

Similar News