ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జాతి రత్నాలే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా.. వెబ్ మీడియా.. ప్రింట్ మీడియా ఇలా అన్ని చోట్ల కూడా జాతి రత్నాలను విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నేడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ప్రమోషన్ కోసం హీరో నవీన్ పొలిశెట్టి మరియు ఇతర యూనిట్ సభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. నేడు మరో రెండు సినిమా లు కూడా విడుదల అవుతున్నాయి. వాటి ప్రమోషన్ కు రెట్టింపు ప్రమోషన్ ను జాతి రత్నాలు టీమ్ చేసింది అనడంలో సందేహం లేదు. కొన్ని పదుల ఇంటర్వ్యూలకు షోలకు నవీన్ పొలిశెట్టి హాజరు అయ్యాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నవీన్ మాట్లాడుతూ.. షూటింగ్ చేయడానికి ముందు రోజు రాత్రి నేను ఎప్పుడూ పడుకోను. పాత్ర కోసం నన్ను నేను మానసికంగా సిద్దం చేసుకోవడంతో పాటు డైలాగ్ లను చూసుకోవడం చేస్తాను అన్నాడు. తెల్లవారు జామున 4 గంటల సమయంలో అనుదీప్ కు కాల్ చేసి సీన్స్ షాట్స్ గురించి మాట్లాడిన సందర్బాలు ఉన్నాయి. నా పాత్ర బాగా రావడం కోసం ఫిజికల్ గా కంటే ఎక్కువగా మెంటల్ గా సిద్దం అవుతాను అంటూ ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తాను ఎక్కడ కనిపించినా కూడా ఏజెంట్ అనే వారు ఇకపై తనను ఈ సినిమా పాత్ర తో గుర్తు పడతారంటూ ధీమా వ్యక్తం చేశాడు.