'జాతిరత్నాలు' చాలా టెన్షన్ పెట్టేసిందట!

Update: 2021-03-23 09:30 GMT
తెలుగు తెర ఒక పుష్పక విమానం వంటింది .. కొత్తగా ఎంతమంది ఆర్టిస్టులు వచ్చినా మరొకరికి చోటు ఉంటుంది. అలాగే హాస్యనటులు కూడా కొత్తగా చాలామందే పరిచయమవుతున్నారు. తమకి గల ప్రతిభని ప్రధానంగా చేసుకుని, విజయాలను అందుకుంటున్నారు .. మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాంటి హాస్య నటుల్లో ఒకరిగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తున్నాడు. తొలి సినిమా 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'తో హిట్ అందుకున్న ఆయన, రీసెంట్ గా 'జాతిరత్నాలు'తో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా అనేక విషయాలను పంచుకున్నాడు.

'జాతిరత్నాలు' క్రితం ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావలసిన సినిమా. సమ్మర్ లో విడుదలకి అంతా రెడీ చేసుకున్నాము. 'లాక్ డౌన్' కారణంగా ఒక ఏడాది డిలే అయింది. ఈ ఏడాది పాటు మేము చాలా టెన్షన్ పడ్డాము. ఎప్పటికప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారని అనుకుంటే .. అది కొనసాగుతూ వెళ్లింది. అసలు థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అవుతాయా? అనే డౌట్ పెరుగుతూ రావడంతో టెన్షన్ స్టార్ట్ అయింది. ఓటీటీ నుంచి వరుసగా ఆఫర్లు వచ్చేవి .. అయినా మా నిర్మాతలు రిస్క్ తీసుకుని, థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఆడియన్స్ వస్తారో లేదో తెలియదు .. అయినా నిర్మాతలు ధైర్యం చేశారు. లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మేము మాటిమాటికీ బీపీ చెక్ చేయించుకున్నాము. అసలు మా పరిస్థితి ఏమిటి .. సినిమా రిలీజ్ అవుతుందా .. కాదా? అని చాలా టెన్షన్ పడిపోయాము. కానీ ఎప్పుడైతే టీజర్ కు .. ట్రైలర్ కు .. చిట్టీ సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందో, అప్పటి నుంచి మాలో ఉత్సాహం ఊపందుకుంది. ఆడియన్స్ ఈ సినిమాకి తప్పకుండా కనెక్ట్ అవుతారు అనే ధైర్యం అప్పుడు మాకు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.   
Tags:    

Similar News