బ్యానర్ ను స్థాపించిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరసగా మూడు ఇండస్ట్రీ హిట్స్ సాధించిన సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. శ్రీమంతుడు-జనతా గ్యారేజ్-రంగస్థలం ఆయా హీరోలకు సైతం కెరీర్ బెస్ట్ గా నిలవడం మాములు విషయం కాదు. దీనికి ముగ్గురు సారధులు అన్న సంగతి తెలిసిందే. నవీన్ - రవి శంకర్ - సివి మోహన్ సంయుక్తంగా కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు.
గత ఏడాది సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ ఫలితాలు ఆశించిన స్థాయిలో దక్కకపోవడం కొంత నిరాశపరిచినా ఒకపక్క స్టార్ హీరోలు మరోపక్క బడ్జెట్ సినిమాలు రెండూ బాలన్స్ చేస్తూ నిర్మాణాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వీళ్ళలో ఒకరైన నవీన్ యెర్నేని విడిగా ఓ నిర్మాణ సంస్థను ప్లాన్ చేస్తున్నారన్న గాసిప్ ఒకటి బయటికి వచ్చేసింది. దీనికి స్పందించిన నవీన్ అలాంటి ఉద్దేశం కానీ ప్రణాళిక కానీ తన వద్ద లేదని మైత్రితోనే కొనసాగబోతున్నట్టు కుండబద్దలు కొట్టేశారు.
ఇవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ రిలీజ్ కు రెడీ చేసిన మైత్రి ఉప్పెన షూటింగ్ ని ఫుల్ స్వింగ్ లో పెట్టేసింది. స్క్రిప్ట్ ఓకే అయ్యాక అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబో కూడా ఇదే సంస్థలో మొదలుకానుంది. ఎక్కడ మొదలైందో కానీ మొత్తానికి ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒకరు వేరే బ్యానర్ పెట్టబోతున్నారన్న వార్త బాగానే స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు నవీనే స్వయంగా చెక్ పెట్టేశారు కాబట్టి ఇకపై అనుమానాలకు తావు లేనట్టే