చెన్నై బ్యూటీ త్రిష ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమా మీదే ఉన్నాయి. పదేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుని లేడీ సూపర్ స్టార్ అనిపించేసుకోవాలని ఆశ పడితే.. కెరీర్ కంటిన్యూ అవడమే డౌట్ అనే స్టేజ్ వచ్చేసింది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో.. ఉన్నవాటిపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా తన కెరీర్ లో మొదటిసారిగా చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ నాయకి కోసం బాగానే కష్టపడింది.
కానీ రిలీజ్ కి ముందే త్రిష నాయకికి ఓ కష్టం వచ్చి పడింది. హారర్ కామెడీ జోనర్ తెరకెక్కడం.. రెండు భాషల్లో రూపొందడంతో.. నాయకి చిత్రానికి విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో మంచి ఆఫర్ వచ్చింది. తీరా ఆ ఆఫర్ కాస్తా సెన్సార్ తర్వాత వెనక్కెళ్లి పోయింది. ఇందుకు కారణం నాయకి మూవీకి ఏ సర్టిఫికేట్ రావడమే. ఇప్పుడో సినిమాని టీవీల్లో ప్రదర్శించేందుకు సవాలక్ష అడ్డంకులున్నాయి. ఏ సర్టిఫికేట్ మూవీని అడ్డదిడ్డంగా కత్తిరించేసి కానీ టీవీల్లో టెలికాస్టింగ్ కి ఒప్పుకోవడం లేదు.
అందుకే మొదట నాయకి శాటిలైట్ రైట్స్ తీసుకునేందుకు ఒప్పుకున్న జెమినీ ఛానల్.. ఇప్పుడు తప్పుకుందని అంటున్నారు. వేరే ఛానల్ ను ట్రై చేసినా సేమ్ సిట్యుయేషన్. చిన్నాచితకా కట్స్ తో యూ/ఏ ఇవ్వాల్సిందిగా సెన్సారోళ్లని అడిగినా ససేమిరా అనేశారట. ఇప్పుడు సినిమా సూపర్బ్ అనే టాక్ వస్తే తప్పితే.. నాయకికి శాటిలైట్ గిట్టుబాటు కాదన్న మాట. పాపం రిలీజ్ కి ముందే త్రిష నాయకి కి పెద్ద పంచ్ పడిపోయింది.