నయనతార .. తమిళనాట ఈ పేరుకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి స్టార్ హీరోల క్రేజ్ తో ఆమె క్రేజ్ ను కొలుచుకోవచ్చు .. పోల్చుకోవచ్చు. నయనతార ఏ ముహూర్తంలో వెండితెరకి పరిచయమైందోగానీ, అప్పటి నుంచి ఇప్పటివరకూ కెరియర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో పరిచయాలే అవకాశాలు తెచ్చిపెడతాయని చాలామంది నమ్ముతుంటారు. సినిమా ఫంక్షన్స్ లో మెరిస్తే ఛాన్సులు వస్తాయని భావిస్తారు. కానీ నయనతార ఎవరితోనూ సాన్నిహిత్యంగా ఉండదు .. ఇతరుల సినిమా ఫంక్షన్స్ కి కాదుగదా, తన సినిమాల ప్రమోషన్స్ కే తాను వెళ్లదు.
సాధారణంగా ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాల ప్రభావం వాళ్ల కెరియర్ పై పడుతుంటుంది. దాంతో అవకాశాలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే నయనతార ఈ పాటికి ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలి. కానీ ప్రేమవ్యవహారాలు ఆమె కెరియర్ ను ఎంత మాత్రం డ్యామేజ్ చేయలేకపోయాయి. పైగా అంతకుముందు కంటే ఎక్కువగా ఆమె బిజీ అయింది. తమ గురించి ఏదైనా ఒక వార్త గుప్పుమంటే ఎవరైనా 'విషయం అదికాదు ఇదీ ..' అని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ నయనతారకి అలాంటి అలవాటే లేదు. సమాధానాలు చెప్పడం .. సంజాయిషీలు ఇవ్వడం వంటి ప్రోగామ్త లు ఆమె పెట్టుకోదు. సిన్సియర్ గా తన పని తాను చేసుకుపోతుంటుందంతే!
చిన్న హీరోలతో సినిమాలు చేస్తే స్టార్ డమ్ తగ్గుతుందని చాలామంది హీరోయిన్లు భయపడతారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే రిజల్ట్ కి పూర్తి బాధ్యత తామే వహించవలసి వస్తుందని టెన్షన్ పడతారు. అలాగే కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి కూడా ఆలోచన చేస్తారు. కానీ నయనతార ఇవన్నీ బ్రేక్ తీసుకోకుండా బ్రేక్ చేసేసింది. ఆమెకి కావలసింది కథ .. అందులో తన పాత్ర అంతే. వాటికి తాను ఎంతవరకూ న్యాయం చేశానా అనేది మాత్రమే ఆమె ఆలోచన చేస్తుంది. ఏడాదికి ఆమె అరడజనుకు మించి సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కెరియర్ ను మొదలు పెట్టి 17 ఏళ్లు అయినా ఆమె క్రేజ్ .. డిమాండ్ ఇంతవరకూ తగ్గలేదు. తాము అనుకున్నట్టుగా ఇండస్ట్రీని ఏలిన నాయికలు చాలా తక్కువమంది .. అలాంటివారిలో కూడా నయనతార స్థానం ప్రత్యేకమనే చెప్పుకోవాలి.