సౌత్ లో నయనతార క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు.. తమిళ్ భాషల్లో పెద్ద స్టార్. టాలీవుడ్ సినిమాలు రేర్ గా చేసినా ఇక్కడ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం వెరీ స్పెషల్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ ఆమె. అనుష్క.. కీర్తి సురేష్ లాంటి వారు ఎంత మంది పోటికొచ్చినా...ఆమెను కొట్టే సత్తా మాత్రం ఇప్పట్లో ఎవరికీ లేదు.
గత కొన్నేళ్లగా టాలీవుడ్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. హీరో రేంజ్.. సినిమా బడ్జెట్.. మ్యాటర్ ఉన్న దర్శకుడా? కాదా? అన్న విషయాలు ఆలోచించి సంతకం చేస్తుంటుంది. ఆమెతో నటించాలని చాలా మంది హీరోలు ఆశపడుతున్నా? ఆ ఛాన్స్ మాత్రం అందరికి ఇవ్వదు...కొందరికి మాత్రమే.
ఆమె నిర్ణయాలకు దర్శక నిర్మాతలు కూడా కట్టుబడాలి. దాదాపు రెండు దశాబ్ధాలుగా అమ్మడు పరిశ్రమకు సేవలందిస్తుంది. ఈసందర్భంగా 20 ఏళ్ల ప్రస్తానాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'పరిశ్రమలో ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో సవాళ్లను స్వీకరించాను. వాటిని సాధించుకుని ముందుకు సాగాను. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా మొండిగా పోరాటం చేసాను. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాను. సమస్యలొచ్చాయని బెదిరిపోను. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడమే జీవితమని వాటిని స్వీకరించినప్పుడే అర్ధమవుతుంది.
ఏ సినిమాకైనా ప్రాంతంతో పనిలేదు. కథ ..అందులో పాత్రలు బాగుంటే ప్రేక్షకులంతా ఆదరిస్తారు. 'కనెక్ట్' హిట్ అయిందంటే కారణం అదే .మూడు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాం. అన్నిభాషల్లోనూ ప్రేక్షకులు ఆదరించారు. వినూత్నమైన కంటెంట్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు' అని తెలిపింది.
ప్రస్తుతం నయనతార ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తుంది. బాక్సాఫీస్ వద్ద సోలోగానే సత్తా చాటి కంగనా రనౌత్ లో ఫేమస్ అవుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులొచ్చినా? చాలా సెలక్టివ్ గానే ఎంపిక చేసుకుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.