నయనతార విషయంలో టాలీవుడ్ నిర్మాతల నుంచి చాలా కంప్లైంట్లున్నాయి. డేట్ల విషయంలో మరీ పట్టుదలగా ఉంటుందని.. షూటింగ్ కొంచెం లేటైనా సర్దుకుపోదని.. ప్రమోషన్లకు అస్సలు రాదని.. ఇలా ఆమె మీద నిర్మాతలు రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. ఐతే ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా సమన సినిమాల్లో నటింపజేయకుండా మానలేరు. తాజాగా విక్టరీ వెంకటేష్ సరసన నయనతార ‘బాబు బంగారం’ సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. దీని నిర్మాతను నయన్ బాగా ఇబ్బంది పెడుతోందని.. ఆమె వల్లే సినిమా ఇంకా పూర్తి కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది నయన్.
‘‘నేను బాబు బంగారం నిర్మాతను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేనిచ్చిన డేట్లు అయిపోయాయి. కానీ వాళ్లు షూటింగ్ పూర్తి చేయలేదు. నా డేట్ల వరకూ పక్కాగా షూటింగులో పాల్గొన్నాను. నాకు వేరే కమిట్మెంట్లు కూడా ఉంటాయి కదా. ఒప్పుకున్న సినిమాలను వదలలేను కదా? అందుకే తిరిగి అక్కడ షూటింగులకి హాజరవుతున్నాను. ఈ మధ్యే ఇంకొన్ని రోజులు డేట్లు కావాలని అడిగారు. మరో పదిరోజులు ఇచ్చాను. అయినా కూడా షూటింగ్ పూర్తి చేయకపోతే నా తప్పు కాదు కదా. నేను ఇబ్బంది పెడుతున్నానని అనడం ఎంత వరకు న్యాయం. నేను ప్రొఫెషనల్ గా ఉంటాను. చెప్పిన టైంకి వస్తాను. షూటింగ్ అయిపోగానే వెళ్ళిపోతాను. నేనిచ్చిన డేట్లను సరిగ్గా వాడుకుని సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్లదే’’ అని కుండబద్దలు కొట్టింది నయన్.