నయనతార మళ్లీ మారిపోయింది

Update: 2015-11-21 17:30 GMT
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని నిరూపిస్తోంది నయనతార. ఆమె జీవితంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటూనే ఉంటుంది. కొన్నాళ్లు శింబుతో గాఢమైన ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత ప్రభుదేవాతో డీప్ లవ్ లో ఉంది. ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది.

బేసిగ్గా క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవా కోసం ఆ మధ్య హిందూ మతం స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రభుతోనే పెళ్లి అనుకుని.. మతం మారింది కానీ.. ఆ బంధం ఎంతో కాలం నిలవకపోవడంతో నయన్ డైలమాలో పడిపోయింది. ఐతే వెంటనే మళ్లీ మతం మారాల్సిన అవసరం ఆమెకు లేకపోయింది.

ఐతే తన కొత్త ప్రియుడు విఘ్నేష్ శివన్ కూడా క్రిస్టియనే కావడంతో మతం మారిపోవాలని నిర్ణయించుకుందట నయన్. విఘ్నేష్ తో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనట. హాలిడే ఎంజాయ్ చేయడంతో పాటు ప్రఖ్యాత రోమ్ నగరంలో తిరిగి క్రిస్టియానిటీ స్వీకరించడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుందట. అంటే హిందువుగా టూర్ కి వెళ్లి క్రిస్టియన్ గా తిరిగి రాబోతోందన్నమాట నయన్. పనిలో పనిగా అక్కడే ఆ పెళ్లి తంతు కూడా ముగించేస్తే ఓ పనైపోతుందిగా నయన్!
Tags:    

Similar News