మెగా మూవీ.. చెర్రీకి మొదటి షాక్

Update: 2016-01-09 07:31 GMT
రామ్ చరణ్ తనే నిర్మాతగా వ్యవహరిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఫైనల్ అయిపోయినా.. ముందు తండ్రి మెగాస్టార్ మూవీపైనే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేశాడు. చిరంజీవి హీరోగా కోలీవుడ్ మూవీ కత్తి రీమేక్ ఇప్పటికే ఫిక్స్ అయింది. దీనికి ముందుగా అనుకున్నట్లుగానే వివి వినాయక్ డైరెక్షన్ చేయనున్నాడు. అయితే.. ఈ సినిమాలో సమంత చేసిన కేరక్టర్ ను.. తెలుగు నయనతార చేయించేందుకు నిర్ణయించుకున్నారు.

వినాయక్ తో పాటు చిరు కూడా నయన్ కే ఓటేయడంతో.. ఆమెను అప్రోచ్ అయాడు నిర్మాత రామ్ చరణ్. అయితే.. నయనతార చెప్పిన ఫిగర్ విని చెర్రీకి మైండ్ బ్లాంక్ అయిందని తెలుస్తోంది. చిరు మూవీలో చేసేందుకు ఏకంగా రెండున్నర కోట్లు అడిగిందట ఆమె. ప్రస్తుతం నయన్ టాప్ రేటెడ్, టాప్ సక్సెస్ ఫుల్ యాక్ట్రెస్. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ సాధించి, మంచి ఊపుమీదుంది. దాంతోపాటు.. టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉందని కూడా ఆమెకు తెలుసు. చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న మూవీ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడతారనే విషయం నయన్ కు తెలసని, తనకు తప్పకుండా రోల్ ఉంటుందనే నమ్మకంతోనే ఇంతగా డిమాండ్ చేసిందని తెలుస్తోంది.

అయితే.. చిరు పక్కన నటించే ఛాన్స్ రావడం కూడా రికార్డ్ కదా అని మరికొందరు అంటున్నారు. అయితే.. రామ్ చరణ్ మాత్రం ఓ ప్రొడ్యూసర్ గా ఆలోచిస్తూ.. నయన్ కు ఆల్టర్నేటివ్ చూడాలని అనుకుంటున్నాడట. మరి చిరు-నయన్ కాంబినేషన్ పైనల్ అవుతుందో లేదో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News