ఊర మాస్ తమళమ్మాయివా నయనా?

Update: 2017-03-06 16:37 GMT
తమిళనాట నయన తార రేంజే వేరు. ఈ భామ కనిపిస్తే చాలు.. అక్కడ కనక వర్షం కురుస్తుంది. ప్రచారానికి రాకపోయినా పర్లేదు.. అసలు కాల్షీట్స్ ఇస్తే అదే మహద్భాగ్యం అనుకునే మేకర్స్.. అక్కడ కోకొల్లలు. ఇప్పుడు నయన్ లీడ్ రోల్ లో డోరా అనే మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోగా.. ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయిపోయింది డోరా.

ఈ సినిమాలో నయనతార లుక్ తో ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. పబ్లిసిటీలో భాగంగా తమిళజనాలను ఆకట్టుకునేందుకు లేటెస్ట్ గా మరో స్టిల్ రిలీజ్ చేసింది యూనిట్. యెల్లో కలర్ కాలర్ నెక్ పంజాబీ డ్రస్ లో.. కళ్ల జోడు పెట్టుకుని పాత కాలం టీవీఎస్ ఫిఫ్టీ తోలేస్తోంది నయన్. ఓ బండికి ఓవైపు హ్యాండ్ బ్యాగ్.. మరోవైపు కూరగాయల సంచీ.. పక్కా తమిళియన్ లుక్ తో నయన్ రూపం డిఫరెంట్ గా ఉంది.

హెయిర్ స్టైల్.. వెనకాల అట్మాస్ఫియర్ చూస్తుంటే.. ఊర మాస్ తమిళ భామగా మెప్పించేందుకు నయన్ సిద్ధమైపోయినట్లుగా కనిపిస్తోంది. అసలే హారర్ మూవీ.. పైగా నయన్ మరీ ఇలా ఒరిజినాలిటీకి దగ్గరగా మెప్పించేస్తుంటే.. ఇక డోరా మూవీ రికార్డులు అంతు చూడ్డం పెద్ద కష్టమేమీ కాదు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News