వాటికి రియాక్షనా? నయన్ ఇక్కడ!!

Update: 2016-08-10 04:48 GMT
మలయాళీ మద్దుగుమ్మ నయనతార.. ఇప్పుడు సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఒకే ఏడాది రెండేసి భాషల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ఎగరేసుకుపోయే రేంజ్ కి చేరుకుంది. ఇది ప్రొఫెషనల్ గా ఆమె సక్సెస్ అయితే.. పర్సనల్-ప్రొఫెషనల్ విషయాల్లో నయన్ పై చాలానే రూమర్స్ వస్తూనే ఉంటాయి. వీటిపై ఏనాడూ నయన్ స్పందించిన దాఖలాలు లేవు.

ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్.. ఇలా ఏ సోషల్ ప్లాట్ ఫామ్ లోనూ నయనతార లేదు. వాటిపై ఇంట్రెస్ట్ కూడా చూపించదు. అందుకే ఈమెను డైరెక్టుగా అప్రోచ్ కావడం ఎవరికైనా చాలా కష్టం. సాధారణంగా సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యే అలవాటు ఈమెకు లేదు. అందుకే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా తలెత్తదు. గత కొన్ని రోజులుగా నయనతారపై చాలానే వార్తలు వస్తున్నాయి. హైద్రాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో నానా రచ్చ చేసిందని.. కాస్ట్‌లీ ఆర్టికల్స్ ను బద్దలు కొట్టేసిందని.. ఈమెను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని.. ఇలా రకరకాల న్యూస్ వచ్చాయి.

వీటన్నిటితోపాటు నయన్ కి హోటల్ రూమ్ ఇచ్చేందుకు స్టార్ హోటల్స్ సిద్ధంగా లేవని కూడా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే.. టాలీవుడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి హైద్రాబాద్ వచ్చినపుడల్లా నయన్ ఒకే హోటల్ లో ఉంటుంది. సింపుల్ గా చెబితే.. నయన్ కి హైద్రాబాద్ హోమ్ అదే అన్నమాట. ఆ హోటల్ వారితో నయనతారకు కానీ.. ఈమెతో వారికి కాని ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఇంత హంగామా నడుస్తున్నా ఆమె స్పందించకపోవడానికి కారణం.. నయన్ స్టెబిలిటీ. అయినా.. ఇలాంటి వాటికి కూడా రియాక్ట్ అయితే.. నయనతార ఎందుకవుతుందిలెండి.
Tags:    

Similar News