తాప్సీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ `గేమ్ ఓవర్` ఇటీవలే థియేటర్లలోకి రిలీజైన సంగతి తెలిసిందే. తొలిరోజు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా తాప్సీ నటనకు మంచి మార్కులే వేశారు. ప్రస్తుతం గేమ్ ఓవర్ తమిళ్- హిందీలో డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతోందట. ఇక ఈ చిత్రంలో సైకలాజికల్ గా సమస్యలు ఉన్న అమ్మాయిగా తాప్సీ నటన పై ప్రశంసలు కురిశాయి. సైకలాజికల్ థ్రిల్లర్ ఆద్యంతం తాప్సీని కొత్త కోణంలో చూపించారన్న ప్రశంసలు దక్కాయి.
ఈ చిత్రానికి అశ్విన్ శరవనన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా గేమ్ ఓవర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఆసక్తికర సంగతి తెలిసింది. తనకు నటన పరంగా ఇంతటి ప్రశంసలు తెచ్చిపెట్టిన ఈ ఆఫర్ తొలుత తాప్సీని వరించలేదట. దర్శకుడు తొలుత తలైవి నయనతారను కలిసి కథ వినిపించారట. అయితే తనకు ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఇందులో నటించలేనని నయన్ అనడంతో ఆ తర్వాత అదే కథను తాప్సీకి వినిపించాడు. అలా తాప్సీ చేతికి ఈ ప్రాజెక్టు చిక్కింది. నయన్ లాస్ .. తాప్సీ గెయిన్ అయ్యిందన్నమాట.
ఇటీవల వరుస ప్రయోగాలతో సత్తా చాటుతున్న తాప్సీకి గేమ్ ఓవర్ ఓ డిఫరెంట్ మూవీ అనే చెప్పాలి. అంతకు ముందు నామ్ షబానా.. మన్మార్జియాన్ లాంటి ఆఫర్లు నటనకు ఆస్కారం ఉన్నవి. పింక్ చిత్రంలోనూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంది. ఇప్పటికిలా తాప్సీ టైమ్ రన్ అవుతోందని భావించాలి.