మేము స్ర్టిప్పర్స్ కాదు: నయన్

Update: 2016-12-26 12:21 GMT
హీరోయిన్స్ అంటేనే గ్లామర్.. స్కిన్ షో. ఎంత రెమ్యునరేషన్ ఇస్తే అంత ఎక్స్ పోజింగ్ చేస్తారు. ఎలాంటి బట్టలైనా వేసుకుంటారు. అసలు హీరోయిన్స్ ని తీసుకునేదే సినిమాకి కలరింగ్ కోసం హీరోలు పాటలు పాడుకుంటే కంపెనీ ఇవ్వడానికి తప్ప వాళ్ల వల్ల మూవీకి ప్రత్యేకంగా వచ్చే మైలేజీ ఏమీ ఉండదు అని చాలామందికి అభిప్రాయాలుంటాయ్.

రీసెంట్ గా సూరజ్ అనే తమిళ దర్శకుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. విశాల్- తమన్నా జంటగా రీసెంట్ గా రిలీజైన ''ఒక్కడొచ్చాడు'' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సూరజ్.. తమన్నా గ్లామర్ డోస్ ఎక్కువైందనుకుంటా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో హీరోయిన్స్ గురించి కాస్త టంగ్ స్లిప్పయ్యాడు. ''వాళ్లని తీసుకునేదే ఎక్స్ పోజింగ్ కోసం.. అమ్మాయిల్ని ఎంత పొట్టి బట్టల్లో చూపిస్తే మాస్ ఆడియెన్స్ అంత థ్రిల్ అవుతారు.. కాస్ట్యూమ్ డిజైనర్స్ తో నేను కావాలనే షార్ట్ డ్రెస్ లు డిజైన్ చేయిస్తా.. యాక్టింగ్ స్కిల్స్ సీరియల్స్ లో చూపించుకోమనండి.. కమర్షియల్ మూవీస్ లో చేయాలంటే ఎక్స్ పోజింగ్ తప్పనిసరి'' అంటూ హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడేశాడు.

యాజ్ యూజువల్ గా సూరజ్ కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా కొందరు ఖండించారు. కానీ మీడియాకి అల్లంత దూరముండే నయనతార మాత్రం సూరజ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఓ వైపు పింక్.. దంగల్ అంటూ సినిమాలు తీస్తూ ఉమెన్ ఎమ్ పవర్మెంట్ గురించి మాట్లాడతారు. మరోవైపు ఇలా నిజ స్వరూపం బయటపెట్టుకుంటారంటూ వాయించేసింది. అసలు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అదీ ఓ డైరెక్టర్ ఇలా మాట్లాడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన నయన్.. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తేనే హీరోయిన్స్ షార్ట్ డ్రెస్ లు వేసుకుంటారే తప్ప డబ్బుకి ఆశపడి కాదంటూ తేల్చి చెప్పింది.

''మేము అందరం స్ర్టిప్పర్స్ అనుకున్నారా? వెండితెర మీద బట్టలు చిన్నగా వేసుకుని అలరించడానికి మేం కీలుబొమ్మలం కాదు. ఇలా అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయడం మానుకోండి'' అనేసింది నయన్. ఇంకోసారి హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చిన నయన్ బోల్డ్ అటిట్యూడ్ కి ఇండస్ట్రీకి మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోందిప్పుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News