సైరాకు నయన్ నైరా అంటోందా?

Update: 2019-09-01 07:08 GMT
సాహో హడావిడి మహా అయితే ఇంకో వారం లేదా పది రోజులు అంతే. వచ్చిన టాక్ ని బట్టి చూస్తే అంత కన్నా వెళ్లే ఛాన్స్ లేదని ట్రేడ్ మాట. ఇదిలా ఉంటే సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి వచ్చేస్తుంది. రేపో మాపో ప్రమోషన్ స్పీడ్ పెంచేస్తారు. ఆడియో తో సహా ఇంకా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. కొణిదెల టీమ్ ఇప్పుడు ఆ ప్లానింగ్ లోనే ఉంది. ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ సక్సెస్ అయ్యింది కానీ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి సమక్షంలో ఇంకా ఏ ప్రోగ్రాం జరగలేదు.

అందుకే ఓ బిగ్ ఈవెంట్ తో సైరాకు ఇక్కడ పబ్లిసిటీ చేసే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయట. కానీ హీరోయిన్ నయనతార మాత్రం తాను వీటికి వచ్చేది లేనిది తన డేట్స్ ఖాళీగా ఉన్నవి లేనివి ఏదీ చెప్పడం లేదట. నా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక నాకేం సంబంధం అన్న రీతిలో వ్యవహరిస్తూ కొణిదెల ప్రతినిధులు కలిసే ప్రయత్నాలు చేస్తున్నా రెస్పాండ్ కావడం లేదని ఫిలిం నగర్ టాక్.

తన సినిమాల ప్రమోషన్ కు వచ్చే అలవాటు నయన్ కు లేదని అందరికి తెలిసిన విషయమే. అయితే సైరాకు సైన్ చేయించుకునేటప్పుడే ఇది స్పెషల్ మూవీ కాబట్టి సహకరించమని చరణ్ కోరినప్పుడు ఓకే చెప్పిన నయన్ ఇప్పుడు మాత్రం ఇలా వ్యవహరించడం పట్ల మెగా కాంపౌండ్ గుస్సాగా ఉందని వినికిడి. ఒకవేళ చెన్నైలో ఏదైనా ప్రోగ్రాం ప్లాన్ చేస్తే వస్తుందేమో తెలియదు కానీ మొత్తానికి సైరా లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు సైతం నయన్ తన పాత పద్ధతిలోనే వ్యవహరించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు.


Tags:    

Similar News