తెలుగు మరియు తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి.. స్టార్ హీరోలకు జోడీగా మెప్పించిన నయనతార ప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్.. లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన నయనతార పారితోషికం విషయంలో సౌత్ లో ఏ ఒక్క హీరోయిన్ కు కూడా అందనంత ఎత్తులో నిలిచింది. సూపర్ స్టార్ అనే పేరుకు తగ్గట్లుగానే ఆమె పారితోషికం అలా అలా పైకి వెళ్తోంది.
బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు అయిదు ఆరు కోట్ల పారితోషికం తీసుకుంటారట అంటూ సౌత్ లో చర్చలు జరిగేవి. కాని ఇప్పుడు నయనతార సింపుల్ గా అయిదు ఆరు కోట్ల పారితోషికంను సౌత్ లోనే అందుకుంటుంది. ఇక ఈమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. నయనతారతో ఇప్పటికే రెండు సినిమా లను తమిళంలో తెరకెక్కించిన అట్లీ త్వరలో హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమాను చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార ను హీరోయిన్ గా అట్లీ భావిస్తున్నాడు. అట్లీ పై ఉన్న అభిమానంతో హిందీలో నటించేందుకు నయన్ దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కు ఉత్తరాదిన పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.. పారితోషికం విషయంలో కూడా గౌరవం ఉండదు. కాని నయనతార విషయంలో మాత్రం అలా కాకుండా ఒకవేళ ఈ సినిమా ను ఆమె ఒప్పుకుంటే దర్శకుడు అట్లీ ఏకంగా 7.5 కోట్ల రూపాయలను పారితోషికంగా ఇవ్వడంతో పాటు లాభాల్లో వాటా ను కూడా నిర్మాత నుండి ఇప్పించేందుకు సిద్దంగా ఉన్నాడని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ అనే బ్రాండ్ కు అంత పారితోషికం సబబే కదా అంటూ ఆమె అభిమానులు మరియు సన్నిహితులు అంటున్నారు. బాలీవుడ్ స్క్రీన్ పై నయన్ ఏ రేంజ్ లో ముందు ముందు దున్నేస్తుందో చూడాలి.