నయనతార రెమ్యునరేషన్.. బాలీవుడ్ భామల కంటే ఎక్కువే!

Update: 2022-08-08 11:33 GMT
లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నయనతార ఇటీవల పెళ్లి పెళ్లితో తన స్టార్ హోదాను మరింత పెంచుకుంది అని చెప్పాలి. సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత అసలు సినిమాల్లో కొనసాగుతారా అనేది కొంత సందేహంగానే ఉంటుంది. కానీ నయనతార మాత్రం ఎప్పటిలోనే తన స్టార్ హోదాను కొనసాగించబోతోంది. అంతేకాకుండా పారితోషకం కూడా అంతకుమించి అనేలా పెంచుతూ ఉండడం విశేషం.

ప్రస్తుతం ఆమె కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ పాత్ర కోసం ప్రత్యేకంగా నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నయనతారకు ఇప్పుడు ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల అట్లీ షారుక్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు క్లారిటీ వచ్చింది. జవాన్ అనే ఆ సినిమాకు కూడా ఆమె అంతకంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే త్వరలో మొదలు కాబోయే ఒక లేడీ ఓరియంటల్ ప్రాజెక్టు కోసం కూడా నయనతార దాదాపు పది కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జీ స్టూడియో సంస్థలో తెరపైకి రాబోయే ఒక థ్రిల్లర్ సినిమాకు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఆ ప్రాజెక్టులో నటించేందుకు నయనతార దాదాపు 10 కోట్లు తీసుకుపోతుందట.

ప్రస్తుతం దీపికా పదుకొనే ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్స్ ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో డిమాండ్ చేస్తున్నారు. అయితే నాయన తార మాత్రం ఈ తరహాలో అందుకోవడం అంటే ఆశ్చర్యమని చెప్పాలి.

మొదటిసారి ఒక కోలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది  చూస్తూ ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో నయనతార మరింత ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News