కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చిన నయన్

Update: 2021-09-19 04:14 GMT
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. నయనతార దారి కాస్త భిన్నం. సాధారణంగా హీరోయిన్ల సినీరంగంలో పదేళ్లు అంటే ఎక్కువ. అందుకు భిన్నంగా ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. నయన్ డిమాండ్ తగ్గట్లేదు సరికదా.. అంతకంతకూ పెరగటమే తప్పించి.. తగ్గే ప్రసక్తే కనిపించదు. 36 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి అగ్రశ్రేణి హీరోయిన్ గా చెలామణీ అవుతున్నారు. ఆమె ఓకే అనాలే కానీ సినిమాలు తీసేందుకు రెఢీగా ఉండే వారెందరో.

రీల్ లైఫ్ లో సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత సక్సెస్ లేదనే చెప్పాలి. అన్నింటికి మించిన గతంలో ఆమె ప్రేమలు ఫెయిల్ కావటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఆమె 'నేను రౌడీనే' చిత్ర షూటింగ్ లో విఘ్నేశ్ లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారటం.. అది కాస్తా ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లటం తెలిసిందే. ఈ మధ్యనే వారి ఎంగేజ్ మెంట్ జరిగింది.

ఇదిలా ఉంటే.. శనివారం విఘ్నేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తానెంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ.. కాబోయే భర్త మీద తనకున్న కొండంత ప్రేమను ప్రదర్శించి సర్ ప్రైజ్ చేసింది నయనతార. విఘ్నేశ్ స్నేహితుల్ని అతని బర్త్ డే పార్టీకి పిలిచి.. గ్రాండ్ గా నిర్వహించింది. దీంతో.. విఘ్నేశ్ ఫిదా అయ్యాడు. నయన్.. తన జీవితంలో భాగమైనందుకు.. వరుస షూటింగ్స్ ఇతర పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి తన కోసం ఇంత అందమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తంగమై' అంటూ పొగిడేశారు. తన బర్త్ డే వేళ నయన్ ప్లాన్ చేసిన పార్టీకి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు. విఘ్నేశ్ చెప్పినట్లే.. నయన్ చాలా భారీగా పార్టీని ప్లాన్ చేసిన వైనం ఫోటోల్ని చూసినంతనే ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News