డ్రగ్స్ కేసు : లిస్టులో ఇంకా చాలామంది ఉన్నారు...?

Update: 2020-09-24 14:30 GMT
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేవుతోంది. డ్రగ్స్ మాఫియాపై దర్యాప్తు ముమ్మరం చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్స్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో అగ్ర కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్ - దీపికా పదుకునే - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ పేర్లు వినిపించాయి. వార్తలను నిజం చేస్తూ ఈ నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. రేపు(సెప్టెంబర్ 25) రకుల్‌ ప్రీత్ సింగ్‌ - దీపికా పదుకునే విచారణకు హాజరుకానుండగా.. సెప్టెంబర్ 26న సారా అలీఖాన్‌ - శ్రద్ధా కపూర్ లు ఎన్సీబీ విచారణకు రానున్నారు.

ఇదిలా ఉండగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేతిలో 50 మంది ప్రముఖుల జాబితా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో రియా ఫోన్ చాటింగ్ మరియు ఆమె వెల్లడించిన విషయాల ఆధారంగా ఎన్సీబీ ఓ జాబితా ప్రిపేర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ సీనియర్ అధికారి 'ఎ - లిస్ట్ సెలబ్రిటీలను విచారణకు రావాలని కోరినట్టు' చెప్పాడని నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా పలువురికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబాట్టా - దీపికా మేనేజర్ కరిష్మా - సుశాంత్ మేనేజర్ శృతి మోడీలను కూడా ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో సిమోన్ ఖంబాట్టా ఈ రోజు ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
Tags:    

Similar News