రియా ఇంటిపై తెల్లవారు జామున అధికారుల మెరుపు దాడి

Update: 2020-09-04 06:30 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో చిక్కుకుంది. డ్రగ్స్‌ డీలర్లు మరియు ట్రాఫికర్లతో రియాకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా ఎంక్వౌరీలో వెళ్లడి అవ్వడంతో ప్రస్తుతం ఆమెను నార్కొటిక్‌ అధికారులు టార్గెట్‌ చేశారు. నేడు తెల్లవారు జామున ఆమె ఇంటిపై మరియు ఆమె సన్నిహితుల ఇళ్లపై మెరుపు దాడులు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలిసిన దాని ప్రకారం రియా ఇంట్లో డ్రగ్స్‌ కు సంబంధించిన వివరాలు ఉన్నట్లుగా వెళ్లడి అవ్వడం వల్లే ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయడం జరిగిందట. ఇటీవలే డ్రగ్స్‌ డీలర్లు మరియు ట్రాఫికర్ల ను అరెస్ట్‌ చేయడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు రియాపై నార్కొటెక్‌ అధికారుల్లో మరింత అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కైజన్‌ ఇబ్రహీంను అరెస్ట్‌ చేయడానికి ముందు బాసిత్‌ పరిహార్‌ నుండి కీలక సమాచారంను అధికారులు సేకరించారు.

వీరితో సంబంధం ఉన్న పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. బాలీవుడ్‌ వర్గాల వారిలో 90 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారు అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది.. ఎంత మంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సుశాంత్‌ కేసు పై నుండి ఇప్పుడు అందరి దృష్టి డ్రగ్స్‌ కేసుపైకి మళ్లింది. రియా ఇంట్లో ఏమైనా డ్రగ్స్‌ లభిస్తే ఆమెను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News