తిక్క కోసం పాట రాసిన స్టార్ రైటర్ సిస్టర్

Update: 2016-07-30 09:34 GMT
స్టార్ రైటర్ కోన వెంకట్ సోదరి.. నీరజ. సెలబ్రిటీ స్టైలిష్ట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈమెకు బోలెడంత గుర్తింపు ఉంది. సమంత - రకుల్ ప్రీత్.. త్రిష.. నయనతార లాంటి స్టార్స్ తో టైమ్ స్పెండ్ చేస్తున్న ఫోటోలను షేర్  చేస్తుండడంతో.. ఆన్ లైన్ లో కూడా ఈమె బాగా ఫేమస్. ఇప్పుడీ నీరజా కోన లిరిక్ రైటర్ అవతారం ఎత్తుతోంది.

సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ నటిస్తున్న తిక్క మూవీకి ఇప్పటికే చాలా ప్రత్యేకతలు ఉండగా.. ఇప్పుడు నీరజా కోన ఓ పాట రాయడం కూడా తోడయింది. కోలీవుడ్ స్టార్ హీరోలు శింబు.. తమన్ లతో పాటలు పాడించగా.. నీరజ కోన ఓ పాట రాయడం మరింత ప్రత్యేకత అవుతోంది. 'నాకు ముందునుంచే రైటర్ ఫీలింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు. నాకు 15 ఏళ్ల వయసులో రాసిన పోయెమ్స్ రెండు పబ్లిష్ అయ్యాయి కూడా' అంటోందీ నీరజ కోన

వెళ్లిపోకే అంటూ సాగే ఈ పాట సూపర్ గా వచ్చిందని అందరూ చెబుతున్నారంటోంది కొత్త లిరిక్ రైటర్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంకరేజ్ చేయడంతోనే ఇది సాధ్యమైందట. ఆ పాట వచ్చే సిట్యుయేషన్ వివరించడంతో.. పాట రాయడం తేలికయిందని చెబుతోంది నీరజ కోన.
Tags:    

Similar News