నీతూచంద్ర.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `గోదావరి` సినిమాలో రాజీ పాత్రలో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ నిరంతరం ఏదో ఒక వివాదంతో ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంది. సౌత్ లో రాజశేఖర్- విశాల్ వంటి హీరోల సరసనా పలు చిత్రాల్లో నటించింది. గోదావరి తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. `సత్యమేవజయతే`లో నటించాక.. అటుపై తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఆ తర్వాత `మనం`లో గెస్ట్ గా మెరిసింది. దాదాపు ఏడెమిదేళ్ళు ఫుల్ బిజీగా కెరీర్ లాగించింది. ఆ తర్వాత ఎందుకో ఈ అమ్మడిని ఆఫర్స్ పలకరించలేదు. వచ్చిన కొన్ని కూడా గెస్ట్ పాత్రలే కావడంతో బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఈ గోదావరి భామని మర్చిపోయారు.
2017లో వరుసగా మూడు సినిమాల్లో మెరిసిన ఈ బీహార్ భామ గత మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంది. దర్శకనిర్మాతలెవరూ ఈ అమ్మడిని పలకరించడం మానేశారు. అయితే నీతూ చంద్ర చేసిన సినిమాలన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే కావడం అది తన కెరీర్ కి మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. మూడేళ్ల గ్యాప్ తర్వాత నీతూ ఎట్టకేలకు ఓ హిందీ ఓ సినిమాలో నటించే ఆఫర్ ని దక్కించుకుంది. అంతా బాగానే సాగుతుందనే టైమ్ లో కరోనా బాగా దెబ్బేసింది.
ఇటీవల షూటింగ్ కోసం ఈ వయ్యారి భామ కాలిఫోర్నియా వెళ్ళిందట. కరోనా కారణంగా అక్కడ షూటింగ్ లు నిలిపివేయడంతో రోజుల కొద్దీ సమయం ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. అక్కడ సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేదని వాపోయింది. ఆకలితో అలమటించిపోయానని ఏడ్చినంత పని చేసింది. అక్కడ బాధాకర సంఘటనలను పంచుకుంటూ తెగ ఫీలై పోతుందీ హాట్ భామ.
``కరోనా వల్ల అక్కడ అన్ని షాపులు మూసేశారు. రెస్టారెంట్లు కూడా ఉండేవి కావు. దీంతో మేం తిండికి ఇబ్బంది పడ్డాం. ఫుడ్ చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు. ఇంకా కావాలని అడిగితే `రేపు రండి` అని చెప్పేవారు. అలా కొన్ని రోజులు ఆకలి బాధలు తప్పలేదు. దీంతో ఇళ్ళు గుర్తొచ్చింది. ఫ్యామిలీకి దూరంగా బతకడమేందుకనిపించింది. అదే సమయంలో ఇంట్లో వాళ్ళు కూడా తిరిగి ఇండియా రమ్మని చెప్పారు. దీంతో వెంటనే ఇండియా వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను. ఇక్కడి ట్రీట్ మెంట్ చూస్తుంటే బాధేసింది. మేమేదో వైరస్ ని తీసుకొస్తున్నట్టు అనుమానంగా చూస్తున్నారు. చివరికి అధికారులు మమ్మల్ని టెస్ట్ చేసి పంపించారు. చివరికి ఇంటికి చేరుకున్నా`` అని తెలిపింది. అంతేకాదు ఈ అనుభవం తన జీవితంలో గుర్తిండిపోతుందని విచారం వ్యక్తం చేసింది. పాపం రాకరాక ఒక్క ఆఫర్ వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురైందని నీతూ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలై పోతున్నారు.