ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఉంటాయి. పాజిటివ్ సెంటిమెంట్లతో పాటుగా పలు నెగెటివ్ సెంటిమెంట్లను కూడా నమ్ముతారు. బాహుబలి-2 రిలీజ్ అయ్యేవరకూ తెలుగులో ఒక్క సీక్వెల్ కూడా హిట్టు కాలేదు. సీక్వెల్ సినిమాలు 90% ఫ్లాపులే. అదే కాదుపలుమార్లు వాయిదా పడిన సినిమాల్లో అధిక శాతం ఫ్లాపులుగానే నిలిచాయి. ప్రస్తుతం నాని - సుధీర్ బాబుల చిత్రం 'V' కూడా ఈ నెగెటివ్ సెంటిమెంట్ తప్పేలా లేదని అంటున్నారు.
నిజానికి 'V' సినిమా లాక్ డౌన్ ప్రకటించక ముందే ఒకసారి వాయిదా పడింది. అప్పటికి వర్క్ పెండింగ్ ఉండడంతో వాయిదా వెయ్యాల్సి వచ్చింది. వారం క్రితమే లాక్ డౌన్ ప్రకటించడంతో ఏప్రిల్ లో రిలీజ్ కావడం కూడా సందేహంగా మారింది. ఇలా వాయిదా పడిన సినిమాలకు సాధారణంగా బజ్ తగ్గిపోతుంది. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ ను తప్పించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడం సాధారణమైన విషయమేమీ కాదు.
పోయినేడాది 'అర్జున్ సురవరం' కూడా ఎన్నో వాయిదాలు పడిన తర్వాతా రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. అయితే ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో.. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారో లేదో అనే అంశం చాలామందికి సందేహంగా ఉంది. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు.. నెగెటివ్ సెంటిమెంట్ అన్నీ దాటుకుని 'V' విజయం సాధిస్తుందా? ఏమో.. వేచి చూడాలి.