రొమాన్స్ కి టైమ్ లేదు.. ప్రెస్ నోట్ ఇస్తా

Update: 2017-09-07 17:30 GMT
అందమైన సోయగాలతో పదహారేళ్ళ వయసులోనే వెండితెరపై మెరిసిన భామ నేహా ధూపియా. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న ఇంకా అమ్మడు కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. మిస్ ఇండియా అండ్ మిస్ యూనివర్స్ అనే కాకుండా ఇతర పురస్కారాలను అందుకున్న ఈ భామ బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. అయితే వయసు మీద పడుతున్నా అమ్మడు మాత్రం ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కనీసం ఓ ప్రేమ వ్యవహారాన్ని కూడా నడపడం లేదు.

ప్రస్తుతం నేహా ‘నో ఫిల్టర్‌ నేహా’ అనే టాక్‌ షోతో బిజీగా ఉంది. ఆ షోతో అమ్మడు బాగానే పాపులర్ అయ్యింది. దీంతో వయసుమీద పడిపోతోంది కదా పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? లేదా ప్రేమలో మునిగి తేలుతున్నారా? అని మీడియా ప్రశ్నలకు అమ్మడు తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చింది. ఆమె ఏమందంటే.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏం లేదు.. ఒకవేళ ఉంటే కనుక తప్పకుండా మీకు చెబుతాను. అవసరమైతే నా ప్రేమ విషయాన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తానని చెప్పడంతో అక్కడవున్న వారందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అలాగే తనకు రొమాన్స్ చేసేంత సమయం లేదని.. కేవలం జిమ్ లో ఉన్నపుడు మరియు ప్రయాణాల్లో కొంత ఖాళి సమయం దొరుకుతుంది.. సో అలా నా  పార్ట్‌నర్‌ దొరుకుతాడేమో అని సమాధానాన్ని చెప్పింది.

ఇక తన స్నేహితులు, అభిమానులు కూడా ఈ ప్రశ్నని అడుగుతునన్నారని ఈ విషయంలో ఎక్కువగా రిస్క్ తీసుకోలేనని చెబుతూ.. అప్పటివరకు సింగిల్ గానే ఉంటానని చెప్పింది. సాధారణంగా తారలు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎదో ఒక టాపిక్ తో డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నేహా మాత్రం బలే ఆన్సర్ ఇచ్చిందంటున్నారు నెటిజన్స్. అయినా నేహాకి ఇప్పుడే 37 ఏళ్ళు దాటాయి మరి అమ్మడు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుందో చుడాలి.     


Tags:    

Similar News