ఫోటో స్టొరీ: పాప మళ్ళీ జిమ్ములో..

Update: 2019-01-31 07:43 GMT
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనుల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే సుందరాంగుల్లో నేహ శర్మ పేరు ముందువరసలోనే ఉంటుంది.  అలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే పాప కాబట్టే తనకు ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్లకు పైగా ఫోలోయర్లున్నారు.  స్టార్ హీరోయిన్ కాకపోయినా ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉండడం అంటే మాటలు కాదు కదా.

రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్ గా నటించిన ఈ నేహ శర్మకు తెలుగులో పెద్దగా గుర్తింపు దక్కలేదు.. అందుకే ముంబైలో తన లక్కును టెస్ట్ చేసుకుంటూనే ఉంది.  ఈ అమ్మడిలో ఉన్న గొప్పదనం ఏంటంటే.. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్క గ్రామ్ కూడా బరువు పెరక్కుండా మెయింటెయిన్ చేయడం. ప్రతి రోజు జిమ్ముకు వెళ్ళడం అక్కడ గంటల తరబడి కసరత్తులు చేయడం ఈ పాప హాబీ.  తాజాగా ఈ సుందరి జిమ్ములోకూర్చుని ఉన్న ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. దానికి ఇలా క్యాప్షన్ ఇచ్చింది..  "ఒక అమ్మాయికి తన జడ వేసుకోవడం తెలిసి ఉండాలి.. ఒకవేళ తెలియక పొతే సహాయం చేసేందుకు సనా పఠాన్ ఉందిగా."

అంటే ఈ పాపకు జడ వేసుకోవడం రాకపోతే జిమ్ములో సనా పఠాన్ సహాయం చేసిందేమో.  కానీ పైనున్న ఫోటోలో ఆమె జడలు కాదు కదా జనాలకు ఆకర్షించేంది.. జడ చివరలో ఉన్న అందాలు. అయినా ఈ పాప జిమ్ములో ఇలాంటి డ్రెస్సులో కసరత్తులు చేస్తుంటే అక్కడ ఉన్న అబ్బాయిల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుందా?  అది చాలదన్నట్టు ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి నెటిజనులకు కూడా గిలిగింతలు పెట్టాలా?   అన్నట్టు ఈ నేహ 'హేరా ఫేరి 3' సినిమాలో ఒక కీలకపాత్ర పోషిస్తోంది.


Tags:    

Similar News