'ఎవరు' సినిమా తర్వాత టాలీవుడ్ కు దూరంగా ఉన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. ఈ ఏడాది 'చక్ర' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంలో ఇప్పుడు ''నేనే నా?'' అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో వస్తోంది. 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజ్ ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ్ లో ఈ చిత్రాన్ని ‘సూర్పనగై’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - ఇతర ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
''నేనే నా?'' ట్రైలర్ ను సెప్టెంబర్ 14 మంగళవారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో రెజీనా కనిపించనున్నారు. తాజాగా వదిలిన పోస్టర్ లో రెజీనా ఓ టేబుల్ పై కూర్చొని ఉండగా.. ఆమె చుట్టూ అస్థిపంజరాలు - పరిశోధన పరికరాలు పుస్తకాలు ఉన్నాయి. మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా ఏం పరిశోధిస్తారనేది తెలియాలంటే మంగళవారం ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే.
''నేనే నా?'' చిత్రాన్ని యాపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా తో పాటుగా వెన్నెల కిషోర్ - అక్షర గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సాబు జోషెఫ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.