చిరంజీవి+బాల‌య్య స్టెప్పుల‌తో కావాల్సిన‌వాడు!

Update: 2022-08-30 11:50 GMT
యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మెరుపు వేగం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ వేవ్ లా  ముందుకు సాగిపోతున్నాడు. `రాజావారు రాణీవారు`..`ఎస్ ఆర్ క‌ళ్యాణమండంపం` సినిమాల‌తో బ్యాక్ టూ  బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని దూసుకుపోతున్నాడు. మ‌ధ్య‌లో సెబాస్టియ‌న్ కాస్త డిస్ట‌బెన్స్ క్రియేట్ చేసిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం యంగ్ హీరో పై అంత‌గా ప‌డ‌లేదు.

త‌న‌దైన‌ ఛామ్..ఎన‌ర్జీతో టాలీవుడ్ లో ఓ ఐడెంటిటీ  ని  రెండు సినిమాల‌తోనే వేయ‌గ‌లిగాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో లైన‌ప్ కూడా బాగుంది. `నేను మీకు బాగా కావాల్సిన వాడిని`..`విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాల‌ నిర్మాణ సంస్థ‌లు అగ్ర‌గామివి  కావ‌డంతో యంగ్ హీరోకి అద‌న‌పు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.

బిగ్ స్పాన్ లో రిలీజ్ కానున్నాయి. ` నేను మీకు బాగా కావాల్సిన వాడిని` సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో ప్రచారం ప‌నులు షురూ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలకు మంచి  రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ  సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ నెంబర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

``నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో`` అంటూ సాగే  లిరికల్ సాంగ్ కి శ్రోత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది.

పాటలో బాలకృష్ణ న‌టించిన  `నరసింహనాయుడు` సినిమాలోని 'చిలకపచ్చ కోకసాంగ్.. అలాగే చిరంజీవి న‌టించిన‌ `అన్నయ్య` సినిమాలోని 'ఆట కావాలా పాట కావాలా' పాటలకు కూడా  కిర‌ణ్ డాన్స్ చేసాడు.  సినిమాలో   ఈ మాస్ నెంబర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంద‌ని టీమ్  ధీమా వ్య‌క్తం చేస్తోంది.  ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది.  ఇందులో సంజ‌న ఆనంద్‌.. సోనూ ఠాకూర్.. సిధ్ధార్ద్ మీన‌న్‌.. ఎస్వి కృష్ణారెడ్డి.. బాబా భాస్క‌ర్‌.. స‌మీర్‌.. సంగీత‌.. నిహ‌రిక‌.. ప్ర‌మోదిని..భరత్ రొంగలి  న‌టిస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్ చేసింది SR  కల్యాణ మండపం ఫేమ్ శ్రీధర్ గాదె . దివంగ‌త ద‌ర్శ‌కుడు  కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News