నేను శైలజ.. తీసేసిన సీన్లు బానే ఉన్నాయ్

Update: 2016-01-10 09:30 GMT
పేపర్ మీద అన్ని సీన్లూ బాగానే ఉంటాయి. షూటింగ్ టైంలో కూడా అంతా బాగానే అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాక తెలుస్తుంది సినిమాను ఎంతగా సాగదీసేశారని. అప్పుడిక కత్తెర్ల మీద కత్తెర్లు పడితే చివరికి రెండు రెండున్నర గంటల సినిమా బయటికి వస్తుంది. ఐతే కొందరు దర్శకులు తాము తీసిన సన్నివేశాల మీద మక్కువతో ఈ కత్తెర్లకు ఇష్టపడరు. దీంతో పెద్ద నిడివితో సినిమాలు బయటికి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలకు ఈ లెంగ్త్ అనేదే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. రామ్ గత సినిమా ‘శివమ్’కు పెద్ద మైనస్‌ గా నిలిచిన అంశాల్లో ఈ నిడివి కూడా ఒకటి. ఆ సినిమా లెంగ్త్ దాదాపు 2 గంటల 45 నిమిషాలుంటుంది. ఐతే రిలీజ్ తర్వాత జనాల కామెంట్స్ చూసి తన తర్వాతి సినిమా విషయంలో జాగ్రత్త పడ్డాడు రామ్.

‘నేను శైలజ’కు సంబంధించి తీసిన చాలా సన్నివేశాల్ని మొహమాటం లేకుండా కోత వేసేసి.. 2 గంటల 15 నిమిషాల తక్కువ నిడివితో సినిమాను థియేటర్లలోకి దించారు. రెస్పాన్స్ బాగుంది. ఇప్పుడు డెలీటెడ్ సీన్స్ అంటూ ఒక్కోటి యూట్యూబ్ లోకి వదులుతున్నారు. రామ్ తన ఫ్రెండుతో కలిసి వైజాగ్ బీచ్ లో మందుకొట్టే సీన్.. ప్రదీప్ రావత్ కు, హీరోయిన్ ఇంటి పనిమనిషికి మధ్య వచ్చే లవ్ సీన్.. హీరో ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ సీన్.. ఇలా ఆరు డెలీటెడ్ సీన్స్ ను రిలీజ్ చేసింది స్రవంతి మూవీస్. ఇవన్నీ కూడా సరదాగా బాగానే అనిపిస్తున్నాయి. సినిమాలో ఇవి ఉన్నా ఇబ్బందేమీ అయ్యేది కాదు. మొత్తానికి ‘శివమ్’ సినిమా ఫలితం.. ‘నేను శైలజ’ నుంచి మంచి సన్నివేశాల్ని కూడా తీసేసేంత భయం పుట్టించిందన్నమాట రామ్ లో.
Full View

Tags:    

Similar News