'బాహుబలి' వెబ్ సిరీస్ అసలేం జరుగుతోంది?

Update: 2021-04-22 10:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా బ్లాక్ బస్టర్‌ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాల్లో కూడా శివగామి పాత్ర ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఆ పాత్రను బేస్‌ చేసుకుని బాహుబలి ప్రీక్వెల్‌ ను తెరకెక్కించాలని నెట్‌ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. వెబ్‌ సిరీస్ గా ఈ ప్రీ క్వెల్‌ కు ప్లా చేశారు. టాలీవుడ్‌ కు చెందిన ముగ్గురు నలుగురు ప్రముఖ దర్శకులు కూడా ఈ వెబ్ సిరీస్ పై వర్క్‌ చేశారు. రాజమౌళి కూడా ఆ వెబ్‌ సిరీస్‌ కోసం తన ఆలోచనలు షేర్‌ చేసుకున్నాడు. వంద కోట్లకు పైగా ఈ వెబ్‌ సిరీస్ కోసం నెట్‌ ఫ్లిక్స్ వారు ఖర్చు చేస్తున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. షూటింగ్ దాదాపు రెండేళ్ల క్రితమే ప్రారంభం అయ్యింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ లేదు.

శివగామి యంగ్‌ ఏజ్ పాత్రతో ఈ వెబ్‌ సిరీస్‌ సాగుతుందని చెప్పుకొచ్చారు. శివగామి యంగ్‌ ఏజ్‌ పాత్రను మృనాల్‌ ఠాకూర్ తో చేయించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిన తర్వాత నెట్‌ ఫ్లిక్స్ వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు షూటింగ్‌ జరిపిన మొత్తం రషెష్‌ ను కూడా పక్కకు పడేసి మళ్లీ ఫ్రెష్‌ గా మొదలు పెట్టాలని నెట్‌ ఫ్లిక్స్ నిర్ణయానికి వచ్చిందట. స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు ప్రముఖ రచయితను ఈ వెబ్‌ సిరీస్‌ కోసం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మళ్లీ రీ షూట్‌ కు శివగామి పాత్రను చేసేందుకు మృనాల్ ఆసక్తిగా లేదట. ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్లను ఇవ్వలేను అంటూ తేల్చి చెప్పిందట. దాంతో మళ్లీ యంగ్‌ శివగామి పాత్రకు గాను మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ గందరగోళం మద్య ఈ వెబ్ సిరీస్ ముడి పడేనా.. వెబ్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News