న్యూ యార్క్ లో జరుగుతున్న మెట్ గాలా 2019 ఈవెంట్ కు పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎంతమంది ఉన్నప్పటికీ ఆ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా కాస్ట్యూమ్ అందరి దృష్టిని ఆకర్షించిని. ఈ సవత్సరం థీమ్ అయిన 'క్యాంప్' కు తగ్గట్టు రెడీ అయింది.
మెట్ గాలాలో ఈ థీమ్ ప్రకారం 'విచిత్రంగా.. అతిగా.. నాటకీయంగా'.. ఎలాగైనా డ్రెస్ ధరించాలి. ఇప్పుడు ప్రియాంక డ్రెస్ ను చూస్తే ఆమె అలా ఎందుకు అలాంటి పిచ్చి డ్రెస్ ధరించిందో మనకు అర్థం అవుతుంది. సో థీమ్ వైజ్ ఆమె డ్రెస్... మేకప్ కరెక్ట్. కానీ అది చూపరులకు ఎలా ఉంది? అంటే మాత్రం చాలామంది సూపర్ అంటున్నారు.. కొందరు విమర్శలు దిగారు. థీమ్ లు ఏవీ పట్టని నెటిజనులు మీమ్స్ తయారు చేసి పీసీ డ్రస్ ను ఒక ఆట ఆడుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ మందిరా బేడీ తన ఇన్స్టా ద్వారా ఒక ఇన్ డైరెక్ట్ సెటైర్ వేసింది. "అర్థం పర్థం లేకుండా డ్రెస్ వేసుకొని పిచ్చిగా కనిపిస్తున్న కొంతమంది మహిళలను చూసి జనాలు రోజంతా ఓహో అంటున్నారు.. ఆహా అంటున్నారు. నేను ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నాకు ఈ మెట్ గాలా సంగతి ముక్క అర్థమైతే ఒట్టు. థీమ్ ను ఫాలో అవ్వండి.. మీకు పుణ్యం ఉంటుంది.. అసహ్యంగా మాత్రం కనిపించకండి" అంటూ ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. ఇది ప్రియాంక చోప్రా ను ఉద్దేశించిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక మీమ్స్ విషయానికి వస్తే 'చార్లీ అండ్ ది చాకొలేట్ ఫ్యాక్టరీ' చిత్రంలో జానీ డెప్ చిత్రవిచిత్రమైన వేషధారణలో కనిపిస్తాడు. ఆ సినిమాలో ఆయన గెటప్ ను ప్రియాంక గెటప్ ను పోల్చారు. ఒక క్రికెట్ అభిమాని అయితే శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా హెయిర్ స్టైల్ లో ప్రియాంక తో పోల్చాడు. మరొక నెటిజనుడు ముంబై లోని దాదర్ ఫాస్ట్ లోకల్ ట్రైన్ ఎక్కక ముందు ప్రియాంక... దిగిన తర్వాత ప్రియాంక అంటూ సెటైర్ వేశాడు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే వీటితో సంబంధం లేకుండా ప్రియాంక తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క మెట్ గాలా ఫోటోలకు మిలియన్ల కొద్దీ లైకులు వచ్చాయి.