మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా దశాబ్ద కాలంగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో మంచి స్టార్ డంతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో కూడా నటించేసింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు హీరోలకు జోడీగా కూడా కనిపిస్తుంది. ఎంతైనా గతంతో పోల్చితే తమన్నా క్రేజ్ తగ్గిందని చెప్పుకోవాలి. తమన్నా తాజాగా ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన 'అభినేత్రి 2' చిత్రంలో నటించింది. రేపు ప్రేక్షకుల ముందుకు ఆ చిత్రం రాబోతుంది. ఇదే సమయంలో తమన్నా సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు చేస్తోంది.
తమన్నా హిందీలో చేస్తున్న ఆ పోస్ట్ ల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తమన్నా వేదాంత దోరణిలో పోస్ట్ లు చేస్తోంది. లేటు వయసులో పెద్ద వారు చెప్పే మాటలు ఆమె చెబుతుంటే కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక వైపు అందాల ఆరబోత చేస్తూనే మరో వైపు ఈ అమ్మడు ఇలా వేదాంతపు మాటలు మాట్లాడటం పట్ల చిత్ర విచిత్రమైన కామెంట్స్ నెటిజన్స్ నుండి వస్తున్నాయి.
తమన్నా పూర్తిగా హిందీలోనే తన వేదాంతపు వ్యాఖ్యలు ట్వీట్ చేస్తుంది. దాంతో ఆమె వ్యాఖ్యలు ఏంటీ అనేది తెలుగు మరియు తమిళ ఆడియన్స్ కు అర్థం అవ్వడం లేదు. ఆమె వేదాంత వ్యాఖ్యలు అర్థం అయిన వారు మాత్రం ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. మూడు పదుల వయసులోనే తమన్నాకు ఎందుకు ఇంత వేదాంత దోరణి వచ్చిందో ఆమె చెప్పాలి. తెలుగు మరియు తమిళంలో అడపా దడపా చిత్రాలు చేస్తూనే ఉన్న ఈ అమ్మడు మొత్తం జీవితం అయిపోయినట్లుగా వేదాంత దోరణిలో మాట్లాడటానికి కారణం ఏంటో..?