నెం 1 డైరెక్టర్.. ఆ విషయంలో సైలెన్స్ ఎందుకు?

Update: 2020-03-30 07:30 GMT
రాజమౌళి టాలీవుడ్ లోనే నెం. 1 డైరెక్టర్. టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ అని అందరూ అంటున్నారు. ఇప్పటికే 'బాహుబలి' తో సెన్సేషన్ సృష్టించిన ఆయన మరోసారి 'RRR' తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈమధ్య 'RRR' ప్రమోషన్ విడియోల తో సంచలనం సృష్టిస్తున్నాడు. భీమ్ ఫర్ రామరాజు వీడియో సోషల్ మీడియా లో భారీ స్పందన దక్కించుకుంది.

రాజమౌళి తన సినిమాలకు రెమ్యూనరేషన్ కింద షేర్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. రాజమౌళి ఒక్కరే కాకుండా ఆయన సినిమాలో కుటుంబ సభ్యులు అందరూ భాగం అవుతారు. అయితే ఒక సినిమాపై ఈ రేంజ్ సంపాదన చాలా తక్కువమందికే ఉంటుందని.. అయితే కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయినవారు.. ఇబ్బంది పడుతున్నవారికి రాజమౌళి కుటుంబం విరాళాలు ప్రకటించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు నటీనటులు.. నిర్మాతలు ఇతర టెక్నీషియన్లు అటు టాలీవుడ్ వర్కర్లకు లేదా ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు ప్రకటించి ప్రజలకు దన్నుగా నిలుస్తున్నారు.

ఇలాంటి సమయంలో రాజమౌళి కుటుంబం కూడా ముందుకు రావాలని.. తమవంతు విరాళం ప్రకటించాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజమౌళి లాంటి వారు ఆర్థిక సాయం ప్రకటించడం ఓ సామాజిక బాధ్యత అనే వాదన వినిపిస్తోంది. రాజమౌళి లాంటి వారు ఇలాంటి విషయాలలో ముందుకు వస్తే అది ఎంతో మంది ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని.. వారు కూడా తమ వంతు సాయం అందించడానికి ముందుకు వస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News