వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత పెద్ద వివాదాన్ని అయినా ఎదుర్కొనేందుకు ఎప్పుడు సిద్దంగానే ఉంటాడు. సాదారణంగా అయితే హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన వారిపై తీవ్రమైన విమర్శలు రావడం వారిపై భౌతిక దాడులు చేయడం చేస్తారు. దేవుళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే పోలీసులు కేసులు కూడా పెట్టిన వారు ఉన్నారు. వాటన్నింటిని పట్టించుకోకుండా రామ్ గోపాల్ వర్మ ఏకంగా మహా శివుడితో మార్ఫింగ్ చేసిన తన పొటోను షేర్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేసి అన్ హ్యాపీ శివరాత్రి అంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ కనుక దీన్ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మరో స్టార్ ఎవరైనా దీనిని చేస్తే ఖచ్చితంగా పరిస్థితులు సీరియస్ గా ఉండేవి. వర్మ ఇలాంటివి చేసినా కూడా పట్టించుకునే రోజులు పోయాయి. ఆయన గురించి చర్చించి సమయం వృదా అనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఆయన్ను లైట్ తీసుకుంటున్నారు కనుక ఇలా పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడేమో అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ కాస్త శివ గోపాల్ వర్మ గా మారడం తో ఆ ఫొటోలు నెటిజన్స్ ను ఆకర్షిస్తున్నాయి.