బాలీవుడ్ లో నెపొటిజంపై ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణం తర్వాత స్టార్ వారసుల యాంటీ ఫ్యాన్స్ రెచ్చి పోతున్నారు. అది ఏ స్థాయిలో అనేది సడక్ 2 ట్రైలర్ కు వస్తున్న డిస్ లైక్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. కోటి డిస్ లైక్స్ తో సడక్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఆలియా పరువు పోయింది. కాని సడక్ ట్రైలర్ కు అనూహ్యంగా భారీ ఆదాయం సమకూరినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సడక్ 2 చిత్రం దాదాపుగా అయిదు కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. గత రెండు మూడు రోజులుగా సడక్ 2 చిత్రం డిస్ లైక్స్ గురించి మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్రైలర్ ను చూసేందుకు ఆసక్తి చూపించారు. డిస్ లైక్స్ కొట్టేందుకు అయినా ట్రైలర్ చూడాలి కనుక అలానే కోటి మంది చూశారు. కనుక ఈ ట్రైలర్ తో భారీ ఆదాయం వచ్చినట్లుగా యూట్యూబ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలియా భట్ మహేష్ భట్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా ట్రైలర్ కు ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. మామూలుగా అయితే ఖచ్చితంగా రెండు రెండున్నర కోట్ల కు మించి ఈ ట్రైలర్ వ్యూస్ ఉండేవి కాదనేది విశ్లేషకుల వాదన. ఆలియా భట్ అదృష్టం సరిగా లేకున్నా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ ట్రైలర్ తో మంచి లాభాలే దక్కించుకుని ఉంటారు. ఫాక్స్ స్టార్ హిందీ వారు ఈ ట్రైలర్ ను యూట్యూబ్ లో ఉంచారు. వారికి భారీ మొత్తంలో ఆదాయం వచ్చి ఉంటుందని యూట్యూబ్ ఆదాయం విశ్లేషించే వారు అంటున్నారు. నెగిటివిటీతో కూడా ఆదాయం రావడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది కదా..!