ఇప్పుడు 21న వస్తున్న జై లవ కుశ.. 27న వస్తున్న స్పైడర్ సినిమాలతో.. 29న శర్వానంద్ హీరోగా మారుతి డైరక్షన్లో రూపొందిన ''మహానుభావుడు'' సినిమా కూడా వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో యువి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూసర్లు కాబట్టి.. ధియేటర్లు ప్రమోషన్లు అదిరిపోతాయ్ కాని.. ఒక్క మ్యాటర్ మాత్రం రిలీజయ్యాకే తెలుస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను ఉద్దేశించి చాలామంది సినిమా లవ్వర్స్.. 'మహానుభావా.. బయటకు రావా?' అంటున్నారు. అదేంటో చూద్దాం.
ముందుగా.. ఈ సినిమాలో శర్వానంద్ ను చూస్తే.. శర్వానంద్ డైలాగులూ లుక్స్ చూస్తే.. రన్ రాజా రన్ సినిమా నుండి అదే తరహాలో చేస్తున్నాడని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ సినిమా హిట్టాయ్యాక మొన్నటి రాధ సినిమా వరకు అదే తరహాలో కనిపించాడు. ఇప్పుడు మహానుభావుడు సినిమాలో కూడా అంతే. అందుకే చూస్తుంటే.. మహానుభావా ఆ హ్యాంగోవర్ లో నుండి బయటకు రావా అంటున్నారు నెటిజన్లు. ఆ తరువాత మనం దర్శకుడు మారుతి విషయానికొస్తే.. ఆయన తీసిన భలే భలే మగాడివోయ్ బాగా హిట్టయ్యింది. సేమ్ అదే తరహా లుక్ అండ్ ఫీల్ ఉండేలా బాబు బంగారం సినిమాను తీశాడు. అది డిజాష్టర్. ఆ తరువాత ఇప్పుడు మహానుభావుడు టీజర్ చూసినా కూడా.. హేయ్ అచ్చం ఇది ఆ సినిమాల తరహాలోనే ఉందే అనిపిస్తోంది. అందుకే ఆయన్ను కూడా.. మహానుభావా అందులోంచి బయటకు రావా అని అడిగేది.
ఇక మూడో వ్యక్తి కూడా ఉన్నారండోయ్. తన ట్యూన్లను తనే మళ్ళీ మళ్ళీ దించుతున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపోజర్.. ఈ సినిమా కోసం కాస్త పర్వాలేదనిపించే పాటలనే అందించాడు. కాని అవేవీ అంత కొత్తగా లేవు. ఎప్పుడూ తమన్ కంపోజ్ చేసే ఆ రొటీన్ సౌండింగులు చాలా వినిపిస్తున్నాయి. అందుకే తమన్ ను కూడా.. మహానుభావా బయటకు రావా అని అడగాల్సిందే. ఏమంటారు? రొటీన్ గా ఒకటే చేయకుండా ఈ మహానుభావులు కొత్తగా ఏదైనా చేసుంటారనే ఆశిస్తూ.. మహానుభావుడు చూడండి. లేకపోతే దాని గురించి మళ్లీ డిస్కస్ చేద్దాం.