‘అరవింద సమేత’లోని పెనివిటి పాట ఇన్ స్టంట్ హిట్టయింది. సినిమాపైనా అంచనాలు పెంచేసింది. రామజోగయ్య సాహిత్యం.. తమన్ ట్యూన్.. కాలభైరవ గానం.. అన్నీ చక్కగా కుదిరాయి ఈ పాటకు. ఇందులో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలో కూడా ఉంటేనా అంటూ అభిమానులు ఊగిపోయారు. ఐతే ఈ పాటలోని సాహిత్యం ప్రకారం జనాలు విజువల్స్ మీద ఒక అంచనాతో ఉన్నారు. గ్రామీణ నేపథ్యంలో రగ్డ్ విజువల్స్ ఊహించుకున్నారు. కానీ ఈ పాట ప్రోమోలో అందమైన సెట్టింగ్ వేసి.. వాతావరణాన్ని చాలా ఆధునికంగా మార్చడం.. ఎన్టీఆర్ మోడర్న్ లుక్ లో ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేయడం మెజారిటీ జనాలకు నచ్చలేదు. ప్రేక్షకులకు ఊహకు భిన్నంగా విజువల్స్ కనిపించడం నిరాశ కలిగించింది. దీనిపై ఆల్రెడీ సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి.
ఐతే సినిమాలో ఈ పాట మొత్తం ఈ తరహాలోనే ఉండదట. 40 శాతం మాత్రమే ప్రోమోలో కనిపించిన విజువల్స్ ఉంటాయట. అందులో మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తాడట. మిగతా 60 శాతం పాట భిన్నంగా ఉంటుందట. అందులో ప్రేక్షకులు ఆశించినట్లే విజువల్స్ ఉంటాయని.. దాన్ని కావాలనే దాచి పెట్టారని చిత్ర బృందం అంటోంది. కాబట్టి పూర్తి పాట చూడకుండా ముందే ఒక అంచనాకు రావొద్దని అంటోంది. ఈ పాట సినిమాలో ద్వితీయార్దంలో వస్తుందని అంటున్నారు. ఒక భార్య.. భర్త గురించి పాడే పాట అయినప్పటికీ.. దీన్ని మేల్ సింగర్ తో పాడించడమూ చర్చనీయాంశమైంది. ఐతే తన తల్లి పాటను హీరో పాడటం అనే కొత్త ఆలోచనతో ఈ పాటను తీర్చిదిద్దినట్లు దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించాడు. ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు సానుకూలంగా తీసుకుంటారని అతనన్నాడు.