రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'విరాటపర్వం'. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో 'నీది నాది ఒకే కథ' అంటూ తొలి సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు సొంతం చేసుకున్న వేణు ఊడుగుల మలి ప్రయత్నంగా చేసిన సినిమా ఇది.
సినిమా ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా వున్నా కరోనా.. భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీని ఈ శుక్రవారం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. హీరో రానా నక్సలైట్ రవన్నగా కనిపించారు. సాయి పల్లవి కథకు కీలకమైన వెన్నెల పాత్రలో నటించింది. సినిమా రిలీజ్ కి డేట్ ప్రకటించిన దగ్గరి నుంచే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని సాయి పల్లవి మరింత హైకి చేర్చి సినిమాకు కావాల్సిన హైప్ ని తీసుకొచ్చింది.
శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీపై ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక వెన్నెల పాత్రలో నటించిన హీరోయిన్ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. క్రాఏడ్ రవన్నాగా రానా దగ్గుబాటి అదరగొట్టారంటూ ట్వీట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా సాయి పల్లవి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆమెకు నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని ట్వీట్ చేస్తున్నారు.
'విరాటపర్వం' మూవీ బ్లాక్ బస్టర్. ఈ జనరేషన్ లో సాయి పల్లవి డిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్. సౌందర్య తరువాత సాయి పల్లవి ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. సినిమాలో సాయి పల్లవి, రానా యాక్టింగ్ సూపర్. ప్రతీ ఫ్రేమ్ ని ఎంజాయ్ చేస్తున్నాం అంటూ కొంత మంది నెటిజన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రియలిస్టిక్ డ్రామా ఇదని, దర్శకుడు చాలా చక్కగా.. నిజాయితీగా తెరకెక్కించాడని, మంచి ప్రయత్నమని, ఈ తరహా సినిమాల్లో ఇదొక క్లాసిక్ గా నిలిచిపోతుందని చాలా మంది నెట్టింట ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయి పల్లవిపై ప్రశంసలు కురిపిస్తూ ఈ సినిమాతో తనకు నేషనల్ అవార్డ్ పక్కా అని ట్వీట్ లు చేయడం విశేషం.