స్వపక్షపాతం.. స్వాభిమానం.. నటవారసత్వం.. కారణం ఏదైనా కానీ ఇటీవల ఇవన్నీ బిగ్ డిబేట్ గా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతరం వీటిపై చర్చ పరాకాష్టకు చేరుకుంది. బాలీవుడ్ మాఫియాతో పాటు డ్రగ్స్ పైనా అన్ని ఇండస్ట్రీల్లో మాఫియా యాక్టివిటీస్ పైనా చర్చ సాగుతోంది. నటవారసుల్ని కాపాడుకునేందుకు బయటి ప్రతిభావంతుల్ని పరిశ్రమలోకి అడుగు పెట్టనివ్వరా? ఇదేమి అన్యాయం? అంటూ ఒక క్యాంపెయిన్ అయితే బలంగా కొనసాగుతోంది. సోషల్ మీడియాల్లో నెటిజనం నటవారసుల్ని వారిని కన్న సెలబ్రిటీ తల్లిదండ్రుల్ని ఓ రేంజులోనే ఆడేసుకుంటున్నారు.
ఇదే తరహాలో సైఫ్ ఖాన్ కి ఆయన భార్యామణి కరీనాకపూర్ ఖాన్ కి.. కుమార్తె సారా అలీఖాన్ కి థ్రెట్ తప్పడం లేదు. ఇక ప్రభాస్ - ఓం రౌత్ కాంబినేషన్ మూవీ `ఆదిపురుష్ 3డి`లో సైఫ్ విలన్ గా నటిస్తారని ప్రచారం సాగడంతో దానిని వ్యతిరేకిస్తూ నెటిజనులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వపక్షపాతం తో ఐక్యత అంటే ఏమిటో తెలీని నటుడిని ఎంపిక చేస్తారా? అని మండిపడుతున్నారు. అతడు బయటి హీరోల్ని బెదిరిస్తాడని .. సుశాంత్ ని తన కుమార్తెను ప్రేమించవద్దని బెదిరించాడని రకరకాలుగా నెటిజనులు సోషల్ మీడియాల్లో కామెంట్లు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అతడిని ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఎంపిక చేయవద్దని ఓంరౌత్ కి సూచిస్తున్నారు. ప్రభాస్ విలన్ సైఫ్ అని ప్రకటించినప్పటి నుంచి ఈ తరహా డిమాండ్లు తెరపైకొచ్చాయి. అంతర్జాలంలో అగ్గి రాజేసాయి.
అసలు సైఫ్ వద్దే వద్దు! అనే వాళ్లలో చాలా మంది ఒక చారిత్రక కథాంశంలో నటించాలంటే చరిత్రపై అవగాహన అవసరమని.. సైఫ్ కి భారతీయ చరిత్రపై పెద్దగా అవగాహన లేనందున ఈ నటుడిని తొలగించాలని చాలా మంది డిమాండ్ చేయడం వేడెక్కించింది.
మరికొందరైతే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను అతడు బెదిరించాడని.. తన కుమార్తె సారా అలీ ఖాన్ ను విడిచిపెట్టమని హెచ్చరించాడని ఆరోపించారు. స్వపక్షపాతం ఉన్న ఈ నటుడి కంటే రావణుడి పాత్రకు రానా దగ్గుబాటి మంచి ఎంపిక అంటూ అభిప్రాయం చెప్పారు చాలామంది. దయచేసి దీన్ని తేలికగా తీసుకోకండి అంటూ పలువురు అభ్యర్థించారు. ప్రభాస్ ని ప్రేమిస్తున్న ఎవరూ సుగర్ బేబీల్ని.. నటవారసురాళ్లను అనుమతించరని కూడా డిబేట్ రన్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. రావణుడిని రావణునిగా ప్రేమిస్తారా? అంటూ సైఫ్ పై పంచ్ వేశాడో నెటిజన్.
నిజానికి బాహుబలి విలన్ గా రానాకి ఉన్న ఇమేజ్ ముందు తానాజీ నటుడి గా సైఫ్ కి దక్కిన ఇమేజ్ ఏమంత గొప్పదేం కాదు. కేవలం హిందీ మార్కెట్ కోసమే అతడిని ఎంపిక చేసుకోవాల్సి ఉండొచ్చు. అలాగని రానా అయితే హిందీ మార్కెట్ ని దొరకబుచ్చుకోవడం ఇబ్బందికరమా? అన్నది ఓంరౌత్ - టీసిరీస్ వర్గాలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నటవారసుల్ని వారిని కన్న తండ్రుల్ని దరికి రానివ్వమని థియేటర్లలో సినిమాలు చూడమని హెచ్చరించిన నెటిజనులు కం ప్రేక్షకుల అభిప్రాయాన్ని లైట్ తీస్కుంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందేమో!