జై బాలయ్య సాంగ్.. రాములమ్మ అంటున్నారే!

Update: 2022-11-25 11:30 GMT
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇక ఇప్పటినుంచి థమన్ పూర్తిస్థాయిలో సినిమా స్థాయిని మరింత పెంచే బాధ్యత తీసుకున్నాడు.

ఇక అతను మొదట బాలయ్య బ్రాండ్ తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య అనే పాటతో ఇదివరకే అఖండ సినిమాలో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన థమన్ ఇప్పుడు అదే తరహా ట్యాగ్ తో జై బాలయ్య అనే సాంగ్ ఇచ్చేసాడు.

ఈ సాంగ్ అయితే ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటుంది కానీ తమన్ మళ్లీ ఎప్పటిలాగే కాపీ క్యాట్ ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో మళ్లీ అతనిపై ట్రోల్స్ అయితే మొదలయ్యాయి. ఎందుకంటే జై బాలయ్య పాట కొంత అటు ఇటుగా ఒసేయ్ రాములమ్మ ట్యూన్ కు దగ్గరగా ఉంది అని ట్రోలింగ్ చేస్తున్నారు. తమన్ తెలుగులో చాలాసార్లు ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జై బాలయ్య సాంగ్ ఎంత కొత్తగా ఇస్తాడో అని అనుకుంటే ఈ విధంగా నిరాశ పరుస్తాడు అని అనుకోలేదు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక విడుదలైన ఈ పాటలో తమను కనిపించిన విధానం మాత్రం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

అతను ఖద్దరు లుక్కులో ఒంటికి బంగారం తగిలించుకొని రాయల్ గా కనిపించాడు. అయితే జై బాలయ్య ట్యూన్ మాత్రం ఒసేయ్ రాములమ్మ పాటకు దగ్గరగా ఉంది అని ట్రోలింగ్ అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇక ప్రతిసారి ట్రోలింగ్ పై కౌంటర్ ఇస్తూ వస్తున్న థమన్ మరి ఈసారి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన మరొక పాటను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View


Tags:    

Similar News